Pawan kalyan cancels bhadrachalam tour: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ప్రసిద్ద రామాలయం భద్రచలంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. అదే విధంగా పవన్ ఈ రోజున మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గంలో ఖమ్మంకు వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు పవన్ భద్రత సిబ్బంది ఈరోజు ఉదయం రోడ్ మ్యాప్ పెట్టారు. ఈ క్రమంలో పవన్ పర్యటను అనౌన్స్ చేసిన గంటల వ్యవధిలోనే మరోక ప్రకటనను పవన్ టీమ్ చేసింది.
తాజాగా.. పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.. ముఖ్యంగా శ్రీరామ నవమి నేపథ్యంలో.. భక్తులు భద్రాచలంకు భారీగా తరలివస్తారు. దీంతో భక్తుల్ని కంట్రోల్ చేయడం చాలా సమస్యగా అవుతుందని పోలీసులు పవన్ కు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక వైపు ఎండలు, మరోవైపు ఈ రద్దీగా ఉన్న సమయంలో పవన్ అక్కడకు వెళ్తే మళ్లీ అనుకొని ఘటనలు జరిగే అవకాశం కూడా ఉండవచ్చని పవన్ తన పర్యటనను రద్దుచేసుకున్నారు. ఇటీవల పవన్ సనాతన ధర్మం కోసం తనవంతుగా ఎంతో కష్టపడుతున్నారు.
ఈ రోజు ఉదయం పవన్ భద్రాచలం వస్తున్నారని తెలియగానే అభిమానులు పండగ చేసుకున్నారు. చాలా మంది రేపు ఎలాగైన భద్రచలం వెళ్లి , రామయ్యను దర్శనం చేసుకుని, తమ అభిమాన హీరోను సైతం చూడాలని ప్లాన్ లు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం పవన తన టూర్ ను రద్దుచేసుకున్న వార్త విని పవన్ అభిమానులు ఒకింత తీవ్ర నిరాశకు లోనయ్యారు.
మరోవైపు భద్రాచలం రామయ్య సన్నిధిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క వెళ్లి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు. ఈ క్రమంలో కొంత మంది పవన్ అభిమానులు సైతం.. పవన్ వస్తున్నాడని తొలుత ఆనంద పడిన.. ఆతర్వాత ఆయన తన పర్యాటన రద్దు చేసుకొవడంను సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులు సైతం భద్రాచలంకు వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









