)
Pawan kalyan condemns controversy comments against amravati women: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి మహిళల్ని ఉద్దేశించి ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన ఛానెల్ లైవ్ డిబెట్ లో మహిళల పట్ల చాలా నీచంగా మాట్లాడారు. దేశంలో ఏపీలో వేశ్యలు రెండో స్థానంలో ఉందని, అమరావతిలో ఎక్కువ మంది మహిళలు వేశ్యలు ఉన్నారని లైవ్ డిబెట్ లో కామెంట్లు చేయడం పెద్ద దుమారంగా మారింది. దీనిపై ఏపీ వ్యాప్తంగా కూటమి శ్రేణులు ఖండించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమంత్రి వంగల పూడి అనిత సైతం దీనిపై సీరియస్ అయ్యారు.
గతంలో వైఎస్ జగన్.. తల్లిని, చెల్లిని కోర్టులకు లాగడం, వాళ్లను వేధించడం వారి వ్యక్తిగత కుటుంబ సమస్యలు అని ఎవరు మాట్లాడలేదన్నారు. కానీ నేడు .. ఆయనకు చెందిన ఛానెల్ లో లైవ్ డిబెట్ లో ఏకంగా అమరావతి మహిళల్ని వేశ్యలు అనడం పెద్ద రచ్చగా మారింది. దీనిపై వెంటనే వైఎస్ జగన్, వైఎస్ భారతీ బహిరంగంగా సారీ చెప్పాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.
ఇది కేవలం ఒక ఛానెల్ తప్పిదమని భావించలేట్లేదని పవన్ అన్నారు. ఆ ఛానెల్ కూడా... ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, మాకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ చెప్పి తప్పించుకోలేదన్నారు. వాటిని ప్రసారం చేయడమే కాదు... చర్చ సందర్భంలో కనీసం ఖండించి, తప్పుబట్టలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో..... నీచ భాషతో పవిత్రమైన అమరావతిలోని బౌద్దాన్ని, అక్కడి మహిళల్ని అవహేళ చేశారని పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అమరావతిలో బౌద్దం, మౌర్యులు, ఇక్ష్వాక రాజుల శాసనాలు లభ్యమైనాయన్నారు. కాకతీయులు ఈ ప్రాంతంలో శాసనాలు వేయించారు. ఆచార్య నాగార్జునుడు, చైనాయాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ రచనలు అమరావతి గొప్పతనం గురించి చెప్తున్నాయన్నారు.
ఇలాంటి అత్యంత ప్రాచీనమైన నేపథ్యం ఉన్న అమరావతి గురించి, అక్కడి మహిళల్ని కించపర్చే విధంగా మాట్లాడిన వాళ్లను, వీరి వెనుకాల ఉన్న వారిని వదిలేప్రసక్తిలేదని పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నీచమై వ్యాఖ్యలు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలకు పోలీసులు ముందుకు వెళ్తారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook