Pawan kalyan donates rs 50 lakhs for konidela village: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం మరోసారి తన గొప్ప మనసు చాటు కున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లాలోని కొణిదెల గ్రామం పర్యటించారు. అయితే.. ఆగ్రామంలో చాలా వెనుక బడి ఉండటం, కనీస వసతులు కూడాలేవని నియోజక వర్గం ఎమ్మెల్యే జయసూర్య డిప్యూటీ సీఎంకు తెలిపారు. ఈ క్రమంలో అప్పుడు పవన్ కళ్యాన్ ఆ గ్రామానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా తెలిపారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. తాజాగా.. కొణిదెలా గ్రామాంలో అన్నిరకాలు వసతుల డెవలప్ మెంట్ కోసం.. తన ఇంటి పేరుతో ఉన్న నంద్యాల జిల్లాలోని కొణిదెల గ్రామానికి రూ.50 లక్షల భారీ విరాళం ప్రకటించారు. దీనితో ఆ గ్రామం పరిధిలో.. రోడ్లు, మురుగు కాల్వలు, తాగునీరు, ఇతర అన్నిరకాల సమస్యల్ని పరిష్కరించుకొవాలని స్థానిక ఎమ్మెల్యే జయసూర్యను ఆదేశించారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, గ్రామ ప్రజల విన్నపం మేరకు.. పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ఆయన సొంత నిధుల నుంచి.. రూ.50 లక్షలు మంజూరు చేశారు. అంతేకాకుండా.. జిల్లా కలెక్టర్ రాజకుమారీకి ఈ చెక్కును పవన్ తరపున అధికారులు అందజేశారు.
అదే విధంగా ఆ గ్రామానికి భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చిన కూడా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పెద్ద మనసుకు గ్రామస్థులు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









