Pawan kalyan holds kid on shoulders: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూల్ కు వెళ్లారు. అక్కడ వివిధ డెవలప్ మెంట్ పనుల్ని ప్రారంభించారు.ఈ క్రమంలో ఒక కార్యకర్త కుమారుడ్ని పవన్ ప్రేమతో తన భుజాల మీద ఎత్తుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లిన కూడా అక్కడ రచ్చ మాములుగా ఉండదు. చాలా మంది అభిమానులు.. పవన్ తమవైపు చూస్తే పండగ చేసుకుంటారు. ఆయనతో కరచాలనం కోసం ఎంతో తాపత్రయ పడిపోతుంటారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్.. కూడా ఏపీలో ఒకవైపు ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హమీలను నెరవేర్చేదిశగా ముందుకు వెళ్తున్నారు. నిరంతం ప్రజల్లో ఉంటూ.. వారి కష్టాలను దగ్గర నుంచి చూస్తు దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల కోసం ఇటీవల పవన్ సరైన భద్రత లేకుండానే.. నేరుగా జనాల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా.. కర్నూలు జిల్లాల ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ అనేక డెవ్ లప్ మెంట్ పనుల్ని సైతం ప్రారంభించారు.
Heart warming moment in today's meeting !#PawanKalyanAneNenu pic.twitter.com/wfvqQ2IuiT
— JanaSena Party (@JanaSenaParty) March 22, 2025
పూడిచెర్ల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. దీనికి భారీగా టీడీపీ, జనసైనీకులు తరలివచ్చారు. ఇంతలో ఒక కార్యకర్త తన బిడ్డ తలకు ఎర్రటి తువ్వాలు చుట్టి.. అచ్చం పవన్ కళ్యాణ్ లా రెడీ చేశారు. పవన్ ను కలిసేందుకు.. కార్యకర్త ఎంతో పరితపించాడు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఆ బుడ్డొడిని తన దగ్గరకు పిలిపించుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు.
ఆ తర్వాత తానే స్వయంగా ఆ బిడ్డను ఎత్తుకుని తన భుజాల మీద కూర్చొబెట్టుకున్నారు. దీంతో ఆ బుడ్డొడు, కార్యకర్త ఆనందానికి మాత్రం హద్దులు లేవని చెప్పుకొవచ్చు. ఆ బుడ్డొడు మాత్రం తెగ సంబరపడ్డాడు.నవ్వుతూ అందరికి అభివాదం చేశాడు. పవన్ కళ్యాన్ ఆ బిడ్డను ఎత్తుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter








