Pawan Kalyan on YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీకి వచ్చే ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదన్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్‌మోహన్ రెడ్డి జర్మనీ వెళ్లు అంటూ సెటైర్లు వేశారు. "జగన్‌హన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకో.. 11 సీట్లు ఉన్న వైసీపీకి ఆ హోదా ఎలా వస్తుంది. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేది.." అని పవన్ కళ్యాణ్ అన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ సభ్యులు ప్రతిపక్ష కోరుతున్నారని.. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని అన్నారు. తమకంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదని హితవు పలికారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రావాలని.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ లోటుపాట్లు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే నిబంధనలు ఉన్నాయని.. వాళ్లను అవమాన పరచాలని కాదన్నారు. ఓట్ల శాతం దృష్టిలో పెట్టుకుంటే.. వాళ్లు జర్మనీ వెళ్లిపోవాలని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై మాజీ మంత్రి అంబటి రాయుడు మండిపడ్డారు. 'పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే' అని సెటైర్ వేశారు. గోవాలో 40 స్థానాలుండగా 21 మ్యాజిక్ ఫిగర్. ఏపీలో 21 స్థానాలను జనసేన గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీట్లతో పవన్ ఏపీలో ఎప్పటికీ సీఎం కాలేడనే అర్థంలో ఆయన ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే
గోవా వెళ్లాల్సిందే ! @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) February 24, 2025
Also Read: BRS Party Joinings: ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట రేవంత్ రెడ్డికి భారీ షాక్.. బీఆర్‌ఎస్‌లోకి వలసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









