)
AP Rural Development: పంచాయతీల్లో పట్టణ స్థాయి ప్రగతి కనిపించాలని.. డాక్టర్ అబ్దుల్ కలాం కలల సాకారం దిశగా ఆంధ్ర ప్రదేశ్ పల్లెల్లో అడుగులు వేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. గతంలో అమలులో ఉన్న లోపభూయిష్ట విధానాల ప్రక్షాళన చేయాలని అధికారులకు చెప్పారు. క్లస్టర్ విధానం రద్దు... జనాభా, ప్రాంతం, ఆదాయ ప్రాతిపదికన గ్రేడ్లు అని అధికార యంత్రాంగానికి తెలిపారు. సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు రాబట్టేలా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. త్వరలో మంత్రివర్గం ముందుకు నూతన విధానాలు తీసుకొస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
పంచాయతీల పునర్వర్గీకరణ, నూతన విధానాల అమలుపై శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేశారు. అమరావతిలోని అసెంబ్లీలో శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక, న్యాయ శాఖల ఉన్నతాధికారులుతో పంచాయతీల పునర్వర్గీకరణ, నూతన సంస్కరణల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక విషయాలు చెప్పారు. 'పంచాయతీల్లో పట్టణ స్థాయి సౌకర్యాల కల్పన లక్ష్యంగా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుదాం. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కలలను సాకారం చేస్తూ ప్రతి పల్లెలో మౌలిక వసతులు మెరుగుపరచే దిశగా పంచాయతీ కార్యాలయాల్లో పౌర సేవలు సత్వరమే సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరణ చేయాలి' అని తెలిపారు.
గతంలో ఉన్న లోపభూయిష్ట విధానాలను గుర్తించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్న విధానాలు, అందులో లోపాలు, చేయాల్సిన మార్పులు చేర్పులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నూతనంగా అమలు చేయనున్న ప్రణాళికలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని.. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్ధిక వెనుకబాటు, లోపభూయిష్టమైన పరిపాలన వ్యవస్థలు పంచాయతీల ప్రగతికి అవరోధాలుగా మారాయని వెల్లడించారు. విధానాల్లో సమూల మార్పులు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు చెప్పారు.
గతంలో ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని పంచాయతీలకు గ్రేడ్లు నిర్ణయించేవారని.. ప్రస్తుతం మనం జనాభా, మండల కేంద్రం, గిరిజన, గిరిజనేతర ప్రాంతం, ఆదాయం అనే అంశాలను విశ్లేషించుకుని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించబోతున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రతి పంచాయతీకి కార్యదర్శి స్థాయి అధికారి నుంచి ప్రతి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నూతన విధానంలో ప్రతి పంచాయతీకి గ్రేడ్ల వారీగా సెక్రటరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook