)
Akhanda Godavari Tourism Project: రాష్ట్రంలో 430 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాజెక్టులు శ్రీకారం చుట్టుకుంటున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. టూరిజంలో లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2024 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలని అన్నానని.. బైక్‌లో ఇంజన్ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ స్పీడ్‌గా వెళ్తుందని అన్నారు. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో 430 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాజెక్టులు శ్రీకారం చుట్టుకుంటున్నాయని తెలిపారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది అని.. రాజమండ్రి అనగానే గుర్తుకు వచ్చేసి గోదావరి తీరం అని అన్నారు. ఎప్పుడూ కూడా ఒక తీరం వెంబడి నాగరికత ఉంటుందన్నారు.
చాలా దశాబ్దాల నుంచి ఉన్న ప్రజల కోరిక ఇది అని.. హేవ్ లాక్ బ్రిడ్జి చాలా పురాతనమైనదన్నారు పవన్ కళ్యాణ్. వాడకుండా వదిలేశారని.. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించి పర్యాటకం కింద మంచి ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. మహా భారతాన్ని తెలుగులో అందించిన ఆదికవి నన్నయ్య గారికి, మనకు ఇష్టమైన బాపు రమణల్లో ఒకరు ముళ్ళపూడి వెంకట రమణ గారికి మరెందరో మహానుభావులకు జన్మనిచ్చిన నేల గోదావరి నేల అని అన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో పర్యాటక రంగానికి సంబంధించి మన ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే 2035 నాటికి 35 లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం తీసుకురావడమని చెప్పారు.
"రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. రాజమండ్రి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతోమంది గొప్పవాళ్లకు జన్మనిచ్చిన నేల. ఈ ప్రాజెక్టుతో ఏటా పర్యాటకుల సంఖ్య 4 లక్షలు అదనంగా పెరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటక ప్రాంతాలకు పునరుజ్జీవం అందిస్తాం' అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రూ.94.44 కోట్ల నిధులతో అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మించనున్నారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేశ్ ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. దీనిలో భాగంగా హేవలాక్ వంతెన, పుష్కర ఘాట్, కడియం నర్సరీ, కోట సత్తెమ్మ గుడి, నదీ తీరాల్లో బోటింగ్, టెంట్ సిటీ, నిత్య హారతి వంటివి 2 ఏళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.