Pawan kalyan mother anjanadevi hospitalized news: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవీ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.ఈ క్రమంలో వెంటనే కుటుంబ సభ్యులు హుటా హుటీన హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. మెగా కుటుంబం ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. ఈ విషయం తెలియగానే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కెబినెట్ అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ లోని ఆస్పత్రికి బయలుదేరారు.
తల్లి అనారోగ్యం వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సైతం తల్లి హెల్త్ పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్, అభిమానులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అంజనాదేవీ పలు మార్లు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులకు కోలుకున్నారు.
ఈ క్రమంలో తాజా ఘటన మాత్రం మెగా కుటుంబ సభ్యులతో పాటు, అభిమానుల్లో కూడా బాగా కలవరపెడుతుంది. మెగా అభిమానులు అంజనాదేవీ తొందరగా కొలుకొవాలని మెగా హీరోల ఇష్టదైవమైన వాయుపుత్రుడు హనుమంతుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









