Pawan Kalyan Son: మూడు రోజుల పాటు అబ్జర్వేషన్.. పవన్ కుమారుడి హెల్త్‌ కండీషన్‌పై డాక్టర్లు ఏంచెప్పారంటే..?

Mark Shankar Health update: డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ ను  ఐసీయూ వార్డ్ నుంచి నార్మల్ వార్డ్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు మార్క్ శంకర్ ను అబ్జర్వేషన్ లో ఉంచాలనికూడా వైద్యులు సూచించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 9, 2025, 12:16 PM IST
  • మార్క్ శంకర్ ను నార్మల్ వార్డుకు తరలించిన వైద్యులు..
  • పూజలు చేస్తున్న పవన్ అభిమానులు..
Pawan Kalyan Son: మూడు రోజుల పాటు అబ్జర్వేషన్.. పవన్ కుమారుడి హెల్త్‌ కండీషన్‌పై డాక్టర్లు ఏంచెప్పారంటే..?

Pawan son Mark Shankar health update:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నిన్న ఉదయం  సమయంలో సింగపూర్ లో చోటు చేసుకుంది. సింగపూర్ లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో మంగళవారం ఉదయం 9.45 గంటలకు , రెండు, మూడు అంతస్తులలో మంటలు 15 మంది చిన్నారులు సహా 19 మంది గాయపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది పిల్లల్ని  కాపాడారు.  పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు.

Add Zee News as a Preferred Source

వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే.. తాజాగా.. పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్ కు చేరుకున్నారు. ముఖ్యంగా మార్క్ శంకర్ కు కాళ్లు, చేతులకు గాయలయ్యాయి. అదే విధంగా.. ఊపిరి తిత్తుల్లో పొగవెళ్లడం వల్ల అత్యవసరంగా ఐసీయూలో ఉంచి మరీ వైద్యులు చికిత్స అందించారు. ఈ  నేపథ్యంలో ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించారు.

Read more: Actress Madhavi latha: పనిపాటలేదారా.. పచ్చళ్ల పాపల మీద పడ్డారు..!. . రంగంలోకి దిగిన టాలీవుడ్ హీరోయిన్.. ఏమన్నారంటే..?

మరో మూడు రోజుల పాటు పవన్ కుమారుడ్ని అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు వెల్లడించారు.ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మార్క్ శంకర్ తొందరగా కోలుకొవాలని గుళ్లలో పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మార్క్ శంకర్ ఆరోగ్యంపై రాజకీయాలకు అతీతంగా నేతలందరు పవన్  కుమారుడు కొలుకొవాలని ఎక్స్ వేదికగా ట్వీట్ లు పెట్టారు. ప్రధాని మోదీ సైతం.. పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరాతీశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News