Pawan kalyan: బక్రిద్ వేళ ముస్లింలను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్‌..?.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ..

Pawan kalyan on cow slaughter:  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల గోవుల్ని కాపాడాలని, అక్రమంగా కబేళాలకు తరలించే వారిపై చర్యలు తీసుకొవాలని కూడా ట్విట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 6, 2025, 03:08 PM IST
  • పవన్ ట్విట్ పై రాజుకుంటున్న రచ్చ..
  • కావాలనే టార్గెట్ చేశారని ట్రోల్..
Pawan kalyan: బక్రిద్ వేళ ముస్లింలను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్‌..?..  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ..

deputy cm pawan kalyan tweet on cow protection: తిరుమల లడ్డు వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాన్ సనాతన ధర్మం అంటూ  రెచ్చిపోయారు. హిందు ధర్మంను కాపాడటం కోసం తనప్రాణాల్ని సైతం అర్పించడానికి సిద్దంగా ఉన్నానంటూ తెల్చి చెప్పారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇటీవల హిందు మతంకు బ్రాండ్ అంబాసిడర్ గా మాట్లాడుతున్నారని, ఎన్నికలకు ముందు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోల మాట్లాడుతున్నారని ఆయను కొంత మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ఇటీవల బక్రీద్ నేపథ్యంలో ఆయన చేసిన ట్విట్ పెద్ద దుమారంగా మారింది.  పవన్ కళ్యాణ్ ఇటీవల ట్విట్ చేస్తు గోవుల్ని సంరక్షించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు . గోవులను పవిత్రంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మన సమాజంలో ఉందని, అటువంటి గోమాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. గోవుల్ని హింసించే వారిపై చర్యలు తీసుకొవాడానికి చట్టాలు ఉన్నాయన్నారు. ఈ ట్విట్ ప్రస్తుతం పెనుదుమారంగా మారింది.

బక్రీద్ నేపథ్యంలో ముస్లింలు ఆవుల్ని తరలిస్తుంటారు. ముఖ్యంగా కభేళాలకు రహాస్యంగా ఆవుల్ని లారీల్లో కుక్కి వాటిని వధిస్తుంటారు. బక్రీద్ రోజు చాలా మంది గోమాంసం తింటారని కూడా చెబుతుంటారు. అయితే.. పవన్ కళ్యాన్ బక్రీద్ పండగ నేపథ్యంలో చేసిన ట్విట్ ను ఒక వర్గం వారు..తమపై పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని కూడా సోషల్ మీడియాలో వేదికగా మండిపడుతున్నారు.  

Read more: Above 100 of Snakes Video: ద్యావుడా..  ఒకే ఇంట్లో వందల కొద్ది పాములు..  వీడియో చూస్తే  షాక్ కాదు.. షేక్ అవ్వడం ఖాయం..

బాధ్యతల గల ప్రభుత్వంలో ఉండి.. ఒక మతాం వారి మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి వ్యాఖ్యలు పండగ పూట చేయడం సరికాదని కూడా వారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కామెంట్స్ లకు గోసంరక్షక ప్రతినిధులు, జనసేన అభిమానులు కౌంటర్ లు కూడా ఇస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News