close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ధర్మపోరాట దీక్ష: చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు క్యూకడుతున్న జాతీయ నేతలు

ఏపీ భవన్ వేదికగా చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట  దీక్షకు మద్దతు తెలిపేందుకు జాతీయ నేతలు క్యూకడుతున్నారు. దీక్షాస్థలికి వచ్చిన ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఆనంద్ శర్మ , అహ్మద్ పటేల్ ఎస్పీ నేత ములాయం తదితర సీనియర్ నేతలు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హారజైన నేతలు విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తున్న పోరాటానికి అండగా ఉన్నామన్న భరోసాను ఇచ్చారు. 

Updated: Feb 11, 2019, 12:53 PM IST
ధర్మపోరాట దీక్ష: చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు క్యూకడుతున్న జాతీయ నేతలు

ఢిల్లీ: ఏపీ భవన్ వేదికగా చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట  దీక్షకు మద్దతు తెలిపేందుకు జాతీయ నేతలు క్యూకడుతున్నారు. దీక్షాస్థలికి వచ్చిన ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఆనంద్ శర్మ , అహ్మద్ పటేల్ ఎస్పీ నేత ములాయం తదితర సీనియర్ నేతలు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హారజైన నేతలు విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తున్న పోరాటానికి అండగా ఉన్నామన్న భరోసాను ఇచ్చారు. 

సాయంత్రం సోనియా...

ఇదిలా ఉండగా మధ్నాహ్నం ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలపనున్నారు. అలాగే సాయంత్రం సోనియాగాంధీ సైతం వేదిక వద్దకు వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి

దీదీ ప్రత్యేక సందేశం..
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రత్యేక సందేశాన్ని పంపారు. మమత పంపిన సందేశాన్ని ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చదివారు. కొన్ని అత్యవసర కారణాల వల్ల ఆమె రాలేకపోయారని వివరణ ఇచ్చారు..

ప్రజా సంఘాల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ దిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. కాగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు నల్ల చొక్కాలు ధరించి  తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ దీక్షకు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీల నేతలు హాజరౌతున్నారు. మరోవైపు వివిధ తెలుగు సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతు పలికాయి.