YS Sharmila: 'ఆడపిల్ల అంటే ఎవరో తెలుసా?'.. వినూత్నంగా మహిళా శుభాకాంక్షలు చెప్పిన వైఎస్‌ షర్మిల

YS Sharmila Womens Day Wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు. గతంలో ఆడపిల్ల అంటే ఎవరో తెలుసా? అంటూ వైరల్‌ కాగా అలాంటిదే తాజాగా వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 8, 2025, 06:16 PM IST
YS Sharmila: 'ఆడపిల్ల అంటే ఎవరో తెలుసా?'.. వినూత్నంగా మహిళా శుభాకాంక్షలు చెప్పిన వైఎస్‌ షర్మిల

Womens Day 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళామణులకు షర్మిల శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌లో ఓ పోస్టు చేశారు. జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళ అని షర్మిల తెలిపారు. గతంలో ఆడపిల్ల అంటే ఎవరో తెలుసా? అంటూ వ్యాఖ్యానించడంతో వైరల్‌ కాగా.. తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెటిజన్లు దానిని గుర్తుచేసుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: YS Sharmila: మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు యూటర్న్‌.. వైఎస్ షర్మిల ఆగ్రహం

'స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. అసలు సృష్టే లేదు. తల్లిగా.. సోదరిగా.. భార్యగా.. కూతురుగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళ. స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది' అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల విమర్శలు చేశారు. 'ఇవావాళ దేశంలో.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదు. ఓటు బ్యాంక్ కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కగట్టింది' అని విమర్శించారు.

Also Read: Big Shock To YS Jagan: జనసేనలోకి పెండెం దొరబాబు.. పవన్‌ కల్యాణ్‌ 'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు'

'వికసిత భారత్‌లో గంటకు 50 మందిపై భౌతిక దాడులు, రోజుకి 80 మందిపై లైంగిక వేధింపులు జరగడం అత్యంత శోచనీయం' అని వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 'పేరుకే నారీశక్తి వందన్ అదినియమ్. ఆచరణలో మహిళలను నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీది తన అనుబంధ సంఘాలది. మహిళల భద్రతపై ఎన్ని ఫాస్ట్రాక్ చట్టాలు ఉన్నా పేరుకు తప్పా ఆచరణలో శూన్యం' అని వైఎస్‌ షర్ ఇటు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు. మహిళలపై దాడులలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా ఉండటం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. హింసకు కారణమవుతున్న మద్యం, మత్తు పదార్థాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

'మహిళా సాధికారిత అంటూ చేస్తున్నది కూడా మోసమే. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు , నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం, సున్నా వడ్డీకే రుణాలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలులాంటి పథకాలు ఇస్తామని.. మహిళలకు టోకరా పెట్టారు తప్పిస్తే ఉద్ధరించింది శూన్యం' అంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News