close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

యంగ్ దర్శకుడు బాబి సరికొత్త అవతారం !!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర సరికొత్త అవతారం ెఎత్తేందుకు సిద్ధమౌతున్నారు

Updated: Jun 11, 2019, 01:49 PM IST
యంగ్ దర్శకుడు బాబి సరికొత్త అవతారం !!

నిర్మాతలుగా మారిన దర్శకుల జాబితాలో రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ , మారుతి, రాఘవ లారెన్స్ లాంటి సక్సెస్ ఫుల్ గా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో యంగ్ దర్శకుడు ఈ జాబితాలో వచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు.

 'పవర్' మూవీతో దర్శకుడిగా పరిచయమై ప్రస్తుతం తన కెరీర్ లో నాలుగో సినిమా చేస్తున్న కే.ఎస్.రవీంద్ర (బాబీ) త్వరలో నిర్మాతగా మారి ఓ సినిమా నిర్మించబోతున్నాడట. ప్రస్తుతం వెంకటేష్-నాగ చైతన్య లతో ‘వెంకీ మామ’ సినిమా తెరకెక్కిస్తున్న బాబీ ఈ సినిమా తర్వాత తన ప్రొడక్షన్ స్థాపించి అరుణ్ పవర్ డైరెక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అరుణ్ పవర్ మీడియాకు తెలిపారు.

కే.ఎస్.రవీంద్ర తాజా నిర్ణయంపై అభిమానుల్లో ఉత్కంత నెలకొంది. మరి నిర్మాత రోల్ లో బాబీ ఏ మేరకు సక్సెస్ అవుతారో తెలుసుకొవాలంటే  కొంత కాలం పాటు వేచిచూడాల్సిందే మరి