)
Dussehra 2025 Vijayawada durga Navratri teppotsavam cancelled: దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో దేశమంత కూడా దసరా పండగ సంబరాల్లో మునిగితెలుతున్నారు.మరోవైపు దసరా రోజున గాంధీ జయంతి కూడా రావడంతో ఒకింత నిరుత్సాహనికి గురౌతున్నారు.
అయిన కూడా వారి జాగ్రత్తలో వారున్నారని చెప్పుకొవచ్చు. అయితే.. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి దసరా ముగింపు ఉత్సవాలలో భాగంగా విజయ దశమి రోజున అమ్మవారికి ప్రతి ఏటా తెప్పొత్సవనం నిర్వహిస్తారు. అయితే.. ప్రస్తుతం నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు పొటెత్తింది. ఈ క్రమంలో తెప్పొత్సవనం నిర్వహించడం అసాధ్యమని అధికారులు వెల్లడించారు.
గతంలో.. 2022-2023 ఏడాదిల్లో విజయదశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. మహామండపంలో ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు గతేడాది వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా నది ఒడ్డున దుర్గాఘాట్‌పై హంస వాహనంపై పూజలు చేశారు.
ప్రస్తుతం కూడా వరదల కారణంగా.. తెప్పొత్సవం నిర్వహణ సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఇక దసరా నేపథ్యంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.దీంతో భక్తులు అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకుంటున్నారు. అధికారుల ఏర్పాట్లతో ప్రజలు కూడా క్యూలైన్ లలో నియమాల్ని పాటిస్తు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook