)
Dussehra Wishes Of Telugu States CMs: ఈరోజు దేశవ్యాప్తంగా దసరా అంగరంగ వైభవంగా జరుపుకొనున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా.. అంటే మన పురాణాల ప్రకారం రాముడు రావణుని సంహరించినందుకు ఈ వేడుక దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది 2025 అక్టోబర్ 2వ తేదీ దసరా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈరోజే గాంధీ జయంతి కూడా రావడం విశేషం. అయితే ఆశ్వీయుజ మాసంలో హిందూ క్యాలెండర్ ప్రకారం రావణుడిపై రాముడు సాధించిన విజయానికి ప్రతీకగా.. మహిషాసురుని సంహరించిన దుర్గాదేవి విజయంగా పండుగ జరుపుకుంటారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు విజయదశమి సుఖ శుభాకాంక్షలు చెబుతూ.. సకల చరాచర దేవరాశులకు సంరక్షించే శక్తి స్వరూపిణి ఆయన కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
#Vijayadashami2025
తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది… pic.twitter.com/Mea67iJBs3— N Chandrababu Naidu (@ncbn) October 1, 2025
ఇక తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా పల్లె పల్లెనా తంగేడు పూల వనం.. పోలిమేరలో పాలపిట్ట దర్శనం.. ప్రతి కార్యములో జయాన్ని స్వాగతిస్తున్న శ్రీ విజయదశమి వేడుక జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని ఆయన కూడా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు
పల్లె పల్లెనా…
తంగేడు పూల వనం.
పొలిమేరల్లో పాలపిట్ట దర్శనం.
ప్రతి కార్యంలో జయాన్ని స్వాగతిస్తూ…
ఈ విజయదశమి వేడుక జరుపుకోవాలని కోరుకుంటూ…ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. #Dussehra #Dussehra2025 pic.twitter.com/ofv1TKZMOC
— Revanth Reddy (@revanth_anumula) October 2, 2025
విజయదశమి శుభాకాంక్షలు.. డిప్యూటీ సీఎం
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. దుష్ట శిక్షణ.. శిక్ష రక్షణ గావించే శక్తి స్వరూపిని నిష్టతో భక్తి శ్రద్ధలతో కొలిచే శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా శోభను విరాజిల్లుతున్నాయంటూ ఆయన తెలంగాణలో బతుకమ్మ వేడుకలతో ఆంధ్రప్రదేశ్ ఊరూరా జరుగుతున్న దుర్గాదేవి పూజలు, భవాని దీక్షలకు దసరా మరింత శోభనం సంతరించుకుందంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడు బలంగా ఉన్న మంచే గెలుస్తుంది : వైఎస్ జగన్
ఇక ఏపీ వైఎస్ఆర్సీపీ అధినేత కూడా ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు.. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచే గెలుస్తుందని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పండుగ సారాంశం అమ్మవారి ఆశీస్సులతో విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి గెలుస్తుందన్నదే విజయదశమి పండుగ సారాంశం. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు.#Dussehra
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025
ఇక ఏడాది విజయదశమి తిథి అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 7:30 నుంచి అక్టోబర్ 2వ తేదీ రాత్రి 7 గంటలకు ముగుస్తుంది. అక్టోబర్ 2నే విజయదశమి జరుపుకుంటున్నారు. అయితే ఈరోజు విజయదశమి సందర్భంగా రావణ దహనం చేయడం ప్రతి ఏడాది వస్తున్న ఆనవాయితీ. దేశవ్యాప్తంగా వైభవంగా ఈ ఘట్టం నిర్వహిస్తారు. విజయదశమి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పాలపిట్ట దర్శనం చేసుకోవడం, జమ్మి చెట్టుకు పూజించడం వంటివి చేస్తూ ఉంటారు. అజ్ఞాతవాసంలోకి పాండవులు వెళ్లినప్పుడు ఈ జమ్మిచెట్టు పై తమ ఆయుధాలను పెట్టి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆయుధాలను తీసి పూజించి యుద్దంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు కౌరవులపై విజయం సాధించారు. అందుకే విజయానికి ప్రతీకగా విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజించే ఆచారం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి