Pastor Praveen Death Case: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపుతోంది. అతడి మృతి రాజకీయ వివాదానికి తెర లేపింది. ఈ వ్యవహారం తీవ్ర రచ్చగా మారడంతో ఎట్టకేలకు పోలీస్ శాఖ స్పందించింది. పాస్టర్ మృతి ఎలా జరిగింది.. ఏం జరిగింది? అనే వివరాలపై పోలీస్ శాఖ ఓ స్పష్టత ఇచ్చింది. పోలీస్ శాఖ ప్రవీణ్ మృతిపై కీలక ప్రకటన ఇచ్చింది. అసలు ఏం జరిగిందో అని తెలిపింది. పాస్టర్ ప్రవీణ్ మృతి ప్రమాదమా? హత్య? అనే తేల్చి చెప్పలేదు.
Also Read: Allu Arjun: వివాదంలో అల్లు అర్జున్ 'జులాయి'.. ఆ సినిమాను చూసి అచ్చం అలానే!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ కేసును అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా రెండు సీసీ ఫుటేజ్‌లు లభించాయని ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్‌పై రాజమండ్రికి పాస్టర్ ప్రవీణ్ వస్తున్నారు. ఆ సమయంలో సోమవారం అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతోపాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్‌ను దాటుకొని వెళ్లాయని వివరించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారాలు ప్రదర్శించారు.
Also Read: Aghori Trapped: వశీకరణంతో అమ్మాయిని కిడ్నాప్ చేసిన అఘోరీ? లైంగిక వాంఛ కోసమా?
రెడ్ కలర్ కారు ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ బైక్ ఒకేసారి వెళ్లాయని.. అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి కారు కోసం విచారణ చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్సైలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ఎవరి వద్ద అయినా బలమైన ఆధారాలు ఉంటే దర్యాప్తు బృందానికి అందించవచ్చుని సూచించారు.
హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అని కోణాల్లోనూ విచారణ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నట్లు ఓ స్పష్టత ఇచ్చారు. సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ కేసులో కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని.. వారంతా చట్టపరిధిలో ఉన్నట్టు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మిగతా వివరాలు వెల్లడించేందుకు పోలీస్ శాఖ నిరాకరించింది. ఇప్పటివరకు తేలిన అంశమేమిటంటే పోలీస్ శాఖ కూడా పాస్టర్ ప్రవీణ్ మృతి హత్య.. లేదా ప్రమాదం? అనేది చెప్పకపోవడం గమనార్హం. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కూడా ఒక స్పష్టత ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









