Electricity Charges Decrease: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు

Big Good News To Public Electricity Charges Decrease: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఐదేళ్లలో తొలిసారి విద్యుత్‌ ఛార్జీలు తగ్గనున్నాయి. విద్యుత్‌ ఛార్జీల తగ్గింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 17, 2025, 05:36 PM IST
Electricity Charges Decrease: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు

Electricity Charges: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ రంగం కీలక విభాగం. విభజన అనంతరం ఏపీలో  విద్యుత్‌ రంగం కీలకంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యుత్‌ రంగ ప్రోత్సాహానికి చర్యలు చేపట్టాయి. తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు భారీ శుభవార్త వినిపించింది. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఐదేళ్లలో తొలిసారి విద్యుత్‌ ఛార్జీలు తగ్గనుండడం గమనార్హం. ఎంత మోతాదులో.. ఎందుకు విద్యుత్‌ ఛార్జీలు తగ్గుతున్నాయో తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

Also Read: Minister Nara Lokesh: వైసీపీ సభ్యులు పారిపోతున్నారు.. మార్షల్స్‌ను పెట్టి సభకు తీసుకురండి: నారా లోకేష్‌

గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి వినియోగదారుల భారీ భారం పడింది. కానీ అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం విద్యుత్‌ భారాల నుంచి ప్రజలకు ఊరట కల్పించింది. పలు డిస్కంల పరిధిలో వెయ్యి కోట్ల రూపాయల వరకు ట్రూడౌన్‌ను ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఛార్జీలను ఎలా తగ్గించాలన్న ఆలోచన తొలిసారి చేసింది. 2019-24 మధ్య నాలుగో నియంత్రిత వ్యవధిలో 1,059.75 కోట్ల రూపాయల ట్రూడౌన్‌ను ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించింది. దీని ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గుముఖం పడతాయి.

Also Read: Ar Rahman: ఏఆర్ రెహమాన్ ఇప్పటికి నా భర్తే.. ఎమోషనల్ అయిన సైరా భాను.. స్టోరీ ఏంటంటే..?  

గత ప్రభుత్వం ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ పేర్లనే ఏపీ ప్రభుత్వం పరిచయం చేసింది. విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూడౌన్ మొత్తాన్ని ఈపీడీసీఎల్ రూ.383.84 కోట్లు, ఎస్పీడీసీఎల్ రూ.428.56 కోట్లు, సీపీడీసీఎల్ రూ.247.35 కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని వినియోగదారుల బిల్లులో సర్దుబాటు చేస్తారా లేదా అనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నాలుగో నియంత్రిత వ్యవధిలో పెట్టుబడి వ్యయం కింద వివిధ అభివృద్ధి పనులకు ఏపీఈఆర్సీ అనుమతించిన ఖర్చు వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్‌కో ప్రతిపాదనలు చేసింది.

కొవిడ్ కారణంగా 2020 మార్చి నుంచి రెండేళ్ల పాటు లాక్‌డౌన్‌, కూలీలు సరిగా దొరక్క అభివృద్ధి పనులు చేయలేదు. దీంతో ఇచ్చిన నిధులు మిగిలాయి. ఖాతాల సర్దుబాటు కింద ఆ మొత్తాన్ని డిస్కమ్‌లకు బదిలీ చేసేందుకు కమిషన్ అనుమతి కోరుతూ ట్రాన్స్‌కో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇదే కాలానికి డిస్కంల ప్రతిపాదనలపైనా కసరత్తు జరుగుతోంది. ఈపీడీసీఎల్ 240 కోట్ల రూపాయల ట్రూడౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిసింది. సీపీడీపీఎల్ నుంచి కూడా రూ.400 కోట్ల వరకు ట్రూడౌన్ వచ్చే అవకాశం ఉందని అంచనా వినిపిస్తోంది.. ఎస్పీడీసీఎల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. డిస్కంల ప్రతిపాదనలపై అధికారులు పరిశీలిస్తున్నారు.

ట్రూఅప్‌: ఏపీఈఆర్‌సీ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు అదనంగా చేస్తే దాన్ని లెక్కించి ట్రూఅప్‌ కింద విద్యుత్‌ సంస్థలు వసూలు చేయడాన్ని ట్రూఅప్‌

ట్రూడౌన్‌: కమిషన్‌ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు తక్కువగా ఉంటే ఆ మిగులు మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తారు. వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం ఏదోలా తగ్గుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News