Elephant Attack: మహాశివరాత్రి ముందు ఘోరం.. భక్తులను తొక్కిచంపిన ఏనుగులు, ఐదుగురు మృతి..

Annamayya District Elephant Attack: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో ఘోరం చోటు చేసుకుంది. ఏనుగుల భీభత్సంతో ఐదుగురు భక్తులు మృతి చెందారు. రేపు శివరాత్రి సందర్భంగా గుండాలకోనకు వచ్చిన భక్తులపై ఏనుగులు దాడి చేశాయి.

Written by - Renuka Godugu | Last Updated : Feb 25, 2025, 10:32 AM IST
Elephant Attack: మహాశివరాత్రి ముందు ఘోరం.. భక్తులను తొక్కిచంపిన ఏనుగులు, ఐదుగురు మృతి..

Annamayya District Elephant Attack:  మహాశివరాత్రి ముందే మహాఘోరం చోటు చేసుకుంది. రేపు అత్యంత మహాపవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా వై కోటకు చెందిన భక్తులు గుండాలకోన ఆలయం వద్దకు వెళ్తున్నారు. అయితే ఏనుగులు ఒక్కసారిగా ఆ భక్తులపై దాడిచేయడంతో అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. మృతులు కన్నెగుంట ఎస్టి కాలనీకి చెందిన మణెమ్మ, రాయుడు గా గుర్తించారు.. ఇక మరో ఇద్దరు చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Add Zee News as a Preferred Source

ఘటనపై అటవీ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి చేరుకొని ఏనుగుల గుంపు నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే మహాశివరాత్రికి ఈ గుండాలకోన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ మహామల్లేశ్వర ఆలయానికి భక్తులు శివుని దర్శనార్థం వస్తారు. అయితే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇలా ఏనుగుల దాడి సాధారణంగా మారిపోయింది.  ఏనుగుల గుంపును అదుపు చేసే కర్ణాటకకు చెందిన కుంకీ ఏనుగులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఏనుగుల దాడి మరింత పెరిగింది. ఈ దాడుల్లో పలువురు అమాయక జనం ప్రాణాలు కోల్పోతున్నారు.

గుండాలకోన ఏనుగుల దాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అందించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని భద్రత కల్పించాలని సూచించారు. 

ఈ గుండెలకోన ఎనుగుల దాడి ఘటనపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతే కాదు మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక పరిహారం కూడా ప్రకటించారు.. దీంతోపాటు క్షతగాత్రులకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏనుగుల బీభత్సం కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా ఇళ్లపై కూడా దాడి చేసి ఏనుగులను బీభత్సం సృష్టించాయి. ఇక పొలంలో రైతుల ప్రాణాలు కూడా తీసిన ఘటనలు కోకోల్లలు.

ఇక మృతదేహాలను రైల్వే కోడూరు ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా.. తిరుపతి రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే అందులో మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగు దాడి ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు.. ఘటనపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసి, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఫోన్లో ఆరా తీశారు. భక్తుల మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:  సొరంగం మళ్లీ కూలింది.. 3 రోజులు గడిచినా దొరకని కార్మికుల ఆచూకీ, నేడు ప్రభుత్వం కీలక ప్రకటన..?

ఇదీ చదవండి: మహాశివరాత్రి.. ఖాతాదారులకు అలెర్ట్‌ ఈ వారం బ్యాంకులు 2 రోజులు బంద్‌..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News