
Kuppam Women Incident: సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన అప్పులతో మహిళను చెట్టుకు కట్టేసి వేధించిన సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఇదేనా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ సంఘటన మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమేనని మండిపడ్డారు. దుష్ట సంప్రదాయంలో టీడీపీ నాయకులు చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు ఎందరో బలయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన సంఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా?' అని నిలదీశారు. 'మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?' అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
'సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించాడు అని వెల్లడించారు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా కనికరం చూపకుండా.. విడిచిపెట్టకుండా హింసించారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ వివరించారు.
శవ రాజకీయాలు ఎవరు చేశారన్నది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు @ncbn.
నందమూరి హరికృష్ణ పార్థివ దేహం పక్కన పెట్టుకుని రాజకీయాలు మాట్లాడింది వాస్తవం కాదా?
తప్పు చేసిన వారికి శిక్షలు వేయడం తప్పుకాదు.. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మాత్రం ముమ్మాటికీ త… https://t.co/qx3ySOMWMP pic.twitter.com/cizoukkK02— YSR Congress Party (@YSRCParty) June 17, 2025
'మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇది ఒకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్‌బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ టీడీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలయిపోతున్నారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. చట్టప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook