Yuvatha Poru Programme: ఎన్నికల ముందు నిరుద్యోగులకు.. యువతకు భారీ ఆశలు పెంచి ఇప్పుడు నట్టేటా ముంచారని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. యువత పోరు పేరిట చేపట్టిన నిరసన కార్యక్రమాలను ఎక్కడికక్కడ పోలీసులు అణచివేయడంపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఎక్స్ వేదికగా చంద్రబాబుకు సూటి ప్రశ్నలు వేశారు.
Also Read: Vijayasai Reddy: 'వైఎస్ జగన్ మనసులో స్థానం లేదు అందుకే రాజీనామా': విజయసాయి రెడ్డి
'పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే చంద్రబాబు కుట్రపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా 'యువత పోరు' చేపడితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నా' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. యువత పోరును అడ్డుకోవాలని చూసినా విజయవంతంగా చేపట్టిన నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబుకు పంపిన తొలి హెచ్చరిక ఇది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Also Read: TTD Darshan: తిరుమల దర్శనాలపై వివాదం.. చంద్రబాబుకి కొండా సురేఖ సంచలన లేఖ
'విద్యాదీవెన పథకంతో సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన పథకంతో హాస్టల్, మెస్ ఛార్జీలను నేరుగా అందిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకువచ్చారు' అని మాజీ సీఎం జగన్ విమర్శించారు. 'ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన విద్యార్థులకు చేరలేదు. ఈ బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులతో పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో చంద్రబాబు తప్పించుకుంటున్నట్టే కదా?' అని వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు. పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? అని ప్రశ్నించారు. పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అని చంద్రబాబును నిలదీశారు.
విద్యార్థులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పగా ఏది అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారని మండిపడ్డారు. తాము తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు చేస్తూ పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కాకముందే నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబు?' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









