YS Jagan Arrest: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు మారినా రాజకీయ కక్షలు మాత్రం మారడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం హయంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బందికి గురి చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీములో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును 50 రోజులకు పైగానే జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టింది గత జగన్ సర్కార్. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వైసీపీ నేతల వంతు వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలు జైళ్లకు క్యూ కడుతున్నారు. వల్లభనేని వంశీ, నందిగం సురేశ్, పోసాని కృష్ణమురళి వంటి నేతలు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.
Also Read: Hero Vishal Marriage: 47 ఏళ్ల వయసులో పెళ్లికి హీరో విశాల్ రెడీ.. ఆ హీరోయిన్ ఈమెనే!
తాజాగా కూటమి ప్రభుత్వం నేరుగా వైసీపీ అధినేత జగన్‌నే టార్గెట్ చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో రూ.3 వేల కోట్లకు పైగానే లిక్కర్ స్కాం జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో జగన్ పాత్ర కూడా ఉందని, ఆయన్ను విచారణ చేయాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా ఉండటంతో లిక్కర్ స్కాంలో విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతుంది.
Also Read: Mysore Rajmata: తిరుమలకు మైసూర్ రాజమాత భారీ కానుక.. దాని వెనుకాల 300 ఏళ్ల చరిత్ర తెలుసా?
ఇప్పటికే ఈ స్కాంపై సిట్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఈ కేసులో కీలక అరెస్టులు జరుగుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి మూడు రోజుల పాటు వీరిద్దర్ని ప్రత్యేకంగా విచారించిన అధికారులు, ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను టచ్ చేశారంటే.. దాదాపు జగన్ దగ్గరకు వెళ్లినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ కూడా ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, వీళ్లు మహా అయితే రెండు, మూడు నెలలు జైలులో ఉంచగలుగుతారని చెప్పడం సంచలనంగా మారింది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లడం పక్కా అని వైసీపీ నేతలే భావిస్తున్నారు.
జగన్ సైతం తన సన్నిహిత నేతలతో తనని అరెస్ట్ చేస్తారని, రెండు, మూడు నెలలు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి రావొచ్చని.. అధైర్యపడొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవలే మంత్రి నారా లోకేశ్ ప్రధాని మోదీతో సమావేశం అయినప్పుడు జగన్ అరెస్ట్ గురించే చర్చించినట్టు సమాచారం. కేసు తీవ్రతను బట్టి చూస్తే ఆగస్టు నెలలో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలే ఎన్నికల్లో ఓడిపోయి ఇబ్బంది పడుతున్న వైసీపీకి, ఇప్పుడు జగన్ జైలుకు వెళ్తే పార్టీ ఏమౌతుందో అని భయం పట్టుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter