YS Jagan: వీడియోను బయటపెట్టిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

YS Jagan Released A Video Of Lotty Charge: ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్న తమ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులపై లాఠీఛార్జ్‌ చేయడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబును నిలదీశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 24, 2025, 09:41 PM IST
YS Jagan: వీడియోను బయటపెట్టిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

Lotty Charge On Students: విద్యార్థుల విభాగం చేపట్టిన యువత పోరు కార్యక్రమంపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీచార్జ్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా యువతను సీఎం చంద్రబాబు మోసం చేశాడని ధ్వజమెత్తారు.

Add Zee News as a Preferred Source

Also Read: Congress Party: కాంగ్రెస్‌ మహిళల నిరసన.. తిరుపతిలో వైఎస్‌ షర్మిలకు చేదు అనుభవం

'కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు “యువత పోరు’’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నా' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Also Read: YS Sharmila: రూ.5 కోట్లు.. రూ.10 కోట్లు ఇచ్చి వైఎస్‌ జగన్‌ క్షమాపణలు చెప్పాలి: వైఎస్‌ షర్మిల

'మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్‌ -2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందని, ప్రజలకు బాండ్లు రాసి మరీ ఇచ్చారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. 'ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే.. మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3 వేల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు  ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు' అని చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిప్పికొట్టారు.

'2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా నిలిచిపోయింది. అప్పటినుంచి ఈ జూన్‌-2025 వరకూ 6 త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్‌. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్‌-2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్-2025 లో  చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200కోట్లు పెండింగ్‌. మొత్తంగా రూ.6,400 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

'మీరు చేయాల్సింది చేయకుండా ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు' అని చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్‌ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటికోసం కూడా డిమాండ్‌ చేయడం తప్పా? మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా?' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News