Gudivada Amarnath: ఇంకొకరిపై ప్రేమ పుట్టినట్లే.. విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి దిమ్మతిరిగే కౌంటర్

Gudivada Amarnath Counter to Vijayasai Reddy: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయేవారా..? అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారని.. కానీ నిన్నటి మాటలు చూస్తే తేడాగా అనిపిస్తోందన్నారు.

Written by - Ashok Krindinti | Last Updated : Mar 13, 2025, 01:25 PM IST
Gudivada Amarnath: ఇంకొకరిపై ప్రేమ పుట్టినట్లే.. విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి దిమ్మతిరిగే కౌంటర్

Gudivada Amarnath Counter to Vijayasai Reddy: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చుట్టు ఉన్న కోటరీ కారణంగానే తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేశానంటూ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జ‌గన్ కోట‌రీ అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు, పార్టీ కార్యకర్తలేనని అన్నారు. నిన్నటి వరకు వైఎస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి.. ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కోట‌రీ అనేది అన్ని రంగాల్లో, అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో సాధారణంగా కనిపించేదేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ‌లో చంద్ర‌బాబు చుట్టూ కోట‌రీ లేదా..? అని ప్రశ్నించారు. ఆ కోట‌రీల గురించి బ‌య‌ట ఉన్న‌వారెవరైనా మాట్లాడితే బాగుంటుందని.. అంతేకానీ కోట‌రీలో ఉండి వ‌చ్చిన వ్య‌క్తులే కోట‌రీ గురించి మాట్లాడ‌టం భావ్యం కాదన్నారు.

Add Zee News as a Preferred Source

"వైఎస్ జగన్ కోటరీ అంటే ప్రజలే.. ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా..? మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది. వేరే వారు మీద ప్రేమ పెరిగితే మిగతా వారి మీద ప్రేమ తగ్గుతుంది. పార్టీ మారిన వ్యక్తి నుంచి అంతకంటే ఏమి ఆశిస్తాము. వైఎస్ఆర్సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. నిన్నటి మాటలు చూస్తే తేడాగా కనిపిస్తుంది. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా..?

ఇదే విధంగా మాట్లాడే వారా.. ఢిల్లీలో మాట్లాడిన మాటలకు విజయవాడలో మాటలకు చాలా తేడా ఉంది. నిన్నటి మాటలు ద్వారా ఆయన ఆయన రాజకీయాల్లోకి వెళ్తారనే విధంగా ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా..?రాష్ట్రంలో మూడు వర్గాలున్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండు వైఎస్ఆర్సీపీ వర్గం.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోయే మూడో వర్గం.

విజయసాయిరెడ్డి వై‌సీపీని వీడి వెళ్లిపోయిన త‌ర్వాత ఇంత‌కన్నా ప‌ద్ద‌తిగా మాట్లాడ‌తార‌ని మేం అనుకోలేదు. ఢిల్లీ వేదికగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని.. వ్య‌వ‌సాయం చేసుకుంటాన‌ని ప్రకటించారు. నిన్న‌టి వ‌ర‌కు ఏ పార్టీలో చేర‌బోయేది నిర్ణ‌యం తీసుకోలేదన్నారు. కానీ ఆయ‌న మాటల్లో మార్పు చాలా స్పష్టంగా.. భిన్నంగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డికి ఒక‌రి మీద మ‌న‌సు విరిగిపోయిందంటే ఇంకొక‌రి మీద ప్రేమ పుట్టింద‌నే అనుకోవాలి.." అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.

Also Read: Best Voice Only Plans: 448 రూపాయలకే 84 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ వాయిస్ ప్లాన్స్ ఇవే

Also Read: Bandi Sanjay Video: వారెవ్వా.. సింగర్‌గా మారిన కేంద్ర మంత్రి.. మోదీని పొగుడుతూ పాట.. వీడియో వైరల్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News