)
YSRCP Digital Book: కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల కోసం డిజిటల్ బుక్ లాంచ్ చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ అండగా ఉంటారని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు డిజిటల్ బుక్ తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని కానీ చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా నగరిలోని తన నివాస కార్యాలయం వద్ద సోమవారం వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్, క్యూర్ కోడ్ పోస్టర్లను మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలి కానీ దురదృష్టవశాత్తు ఏపీలో చంద్రబాబు కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్రమ కేసులు పెడుతూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
సోషల్ మీడియా వారిని వదిలిపెట్టడం లేదని వారిపై కూడా అక్రమ కేసు పెడుతున్నారని రోజా వివరించారు. ఎప్పటికప్పుడు కోర్టులు అక్షింతలు వేస్తున్నా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీలో ఇకపై కార్యకర్తలకే పెద్దపీట ఉంటుందని.. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని ప్రకటించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్‌లో చర్యలు ఖాయమని హెచ్చరించారు. ఎక్కడున్నా వారిని చట్టం ముందు నిలబెడతామని మాజీ మంత్రి రోజా తెలిపారు.
ఎవరికి అన్యాయం జరిగినా ‘డిజిటల్ బుక్’లో నమోదు చేయవచ్చని వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి రోజా తెలిపారు. డీబీ.డబ్ల్యూఈవైయస్ఆర్సీపీ.కామ్ అనే వెబ్సైట్లో కానీ.. 040–49171718 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. పార్టీ అధికారంలోకి రాగానే అందరిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని మాజీ మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ ప్రధానకార్యదర్శి రవీంద్ర, నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, హరి, వైస్ చైర్మన్లు జయప్రకాష్, శంకర్, బాలన్, జడ్పీటీసీ పరంధామన్, నిండ్ర, విజయపురం ఎంపీపీలు లత, మంజుబాలాజి, భార్గవి, నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాలపేటకు చెందిన మున్సిపల్, మండల అ«ధ్యక్షులు రమేష్‌రెడ్డి, తిరుమలరెడ్డి, ఏకాంబరం, వేణురాజు, శివరాజు, సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా, మండల పార్టీ కమిటీ, అనుబంధ కమిటీ నేతలు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook