
Kurnool District Name: తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాకు ఓ నాయకుడి పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్వయంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి వీహెచ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏపీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హనుమంత రావు మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటన చేపట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వీహెచ్ కలిశారు. ప్రత్యేకంగా పవన్ కల్యాణ్‌తో సమావేశమై కీలక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దామోదరం సంజీవయ్య అంశంపై పవన్ కల్యాణ్‌తో వీహెచ్ చర్చలు చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు చర్చించుకున్నారని సమాచారం.
ఏపీలోని కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వీహెచ్ విజ్ఞప్తి చేశారు. సామాజిక పింఛన్లు రావడంలో.. కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో సంజీవయ్య పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు వివరించారు. సంజీవయ్య పేరుతో స్మారక భవనాన్ని ఏపీలో నిర్మించాలని వీహెచ్ ప్రతిపాదించారు. అయితే తమతో జరిగిన చర్చల అంశాన్ని సీఎం చంద్రబాబుకు వివరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook