Vijayasai Reddy vs YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను ఎన్నో అవమానాలు అనుభవించినట్లు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. అధికారంలో లేని సమయంలో తాను అన్నీ చూసుకున్నట్లు.. అధికారంలోకి వచ్చాక నంబర్ 2 అనేది మిథ్యగా భావించినట్లు వెల్లడించారు. తనను వెన్నుపోటుదారుడనని జగన్‌కు చెప్పడంతో 2వ స్థానం నుంచి నేను 2000 స్థానానికి పడిపోయినట్లు వివరించారు. మద్యం కుంభకోణంలో బిగ్‌బాస్ ఉన్నాడో లేదో నాకు తెలియదు అని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Also Read: YS Sharmila: 'అమరావతిపై ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా?'
మద్యం కుంభకోణంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు పిలవడంతో ఆయన శుక్రవారం సిట్ ముందు హాజరయ్యారు. కొన్ని గంటల పాటు విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'లిక్కర్ స్కాంలో సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చా. లిక్కర్‌కు సంబంధించి రెండు సమావేశాలు నా ఇళ్లలోనే జరిగాయి. హైదరాబాద్, విజయవాడలో రెండు మీటింగ్‌లు నా ఇళ్లలోనే జరిగిన మాట వాస్తవం' అని విజయసాయి రెడ్డి ప్రకటించారు.
Also Read: Tirumala Drone: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్
'రెండు సమావేశాల్లో వాసుదేవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హాజరవగా.. ఆ భేటీల్లో జరిగిన విషయాలపై అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పా' అని విజయసాయి రెడ్డి తెలిపారు. ఓఎస్డీ కృష్ణమోహన్, ఐఏఎస్ ధనుంజయరెడ్డి సమావేశాలకు వచ్చారా అని అడిగ్గా వాళ్లు సమావేశాలకు రాలేదని చెప్పారు. 'రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్. రాజ్ కసిరెడ్డిని పార్టీలో వాళ్లే నాకు పరిచయం చేశారు. ప్రశాంత్ కిశోర్‌కు ప్రొటోకాల్ విషయాన్ని ఆయనకే అప్పజెప్పా. రాజ్ కసిరెడ్డి వెనకాల ఎవరున్నారో నాకు తెలియదు' అని వెల్లడించారు.
ప్రభుత్వాన్ని, ప్రజలను కసిరెడ్డి మోసం చేశాడని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. 'రాజ్ కసిరెడ్డి విక్రయించిన సంగతి, మిథున్‌రెడ్డి పాత్ర నాకు తెలియదు. పార్టీని, ప్రజలను రాజ్ కసిరెడ్డి మోసం చేశాడు' అని తెలిపారు. తాను లిక్కర్ విక్రయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. మరోసారి పిలిచినా వస్తానని సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిపారు.
వైఎస్సార్‌సీపీలో తనకు జరిగిన పరాభవాలపై విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 స్థానం ఉండదు. పార్టీ అధికారంలో లేని సమయంలో అన్నీ నేనే చూసుకున్నా. అధికారంలోకి వచ్చాక నంబర్ 2 అనేది మిథ్యగా భావించా. నేను వెన్నుపోటు దారుడనని జగన్‌కు చెప్పారు. 2వ స్థానం నుంచి నేను 2000 స్థానానికి పడిపోయా. వైసీపీలో ఎన్నో అవమానాలు అనుభవించా' అని విజయసాయి రెడ్డి వివరించారు.
రాజ్యసభ ఉప ఎన్నికకు తాను పోటీలో లేను అని విజయ సాయిరెడ్డి ప్రకటించారు. అయితే ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం కొసమెరుపు. 'కోటరీ వల్లే బాధతో పార్టీని వీడా. నేను పెట్టించిన ఛానల్‌లో అనవసరంగా విమర్శలు చేశారు. నేను వ్యవసాయం చేస్తాను.. ఇంకా ఏమైనా చేస్తాను. సాక్షి మీడియా ఎందుకు అనవసర రాతలు?' అని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం స్కామ్‌లో బిగ్‌బాస్ (వైఎస్ జగన్) ఉన్నాడా.. లేడా నాకు తెలియదు అని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









