Papavinasanam Dam Boating: తిరుమల కొండపై స్వామి వారి సేవలకు వినియోగించే పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ చేశారనే వార్త తీవ్ర వివాదాస్పదంగా మారింది. పవిత్రమైన కొండపై వినోదం కోసం పర్యాటక శాఖ బోటింగ్ నిర్వహించారనే వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తిరుమల కొండను ఆధ్యాత్మికానికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఆధ్యాత్మికతను వదిలేసి వినోద.. పర్యాటక కేంద్రంగా తిరుమలను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. విచారణ చేయాలని డిమాండ్
తిరుమల పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ చేశారనే వార్తలపై గురువారం భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తిరుపతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. 'తిరుమల క్షేత్రంలో మరొక ఘోర అపచారం జరిగింది. తిరుమల పవిత్రతను కాపాడతానని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?' అని ప్రశ్నించారు. 'పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ జరిగితే దాని మీద ఏం వివరణ ఇవ్వాలో అర్ధం కాక ఫారెస్ట్ అధికారులపై నెట్టారు' అని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని బోటింగ్ నిర్వహిస్తున్నట్లు ఫారెస్ట్ ఉన్నతాధికారి చెప్పడం హాస్యస్పదంగా ఉందని తెలిపారు.
Also Read: Free Parking: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మాల్స్, మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ఫ్రీ.. ఫ్రీ
'టీటీడీ పరిధిలో డ్యాం ఉంది. ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుమానాలు చెప్పడం తిరుమల చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు' అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ట్రయల్ రన్‌లో పాల్గొన్న అటవీ సిబ్బంది ఎవరు? అని ప్రశ్నించారు. 'టూరిజం అభివృద్ధి చేస్తానని ఇటీవల తిరుమల పర్యటనలో చంద్రబాబు చెప్పారు. టూరిజం అంటేనే విలాసం.. వినోదానికి సంబంధించినది. ఆధ్యాత్మికం వేరు.. టూరిజం వేరు' అని భూమన వివరణ ఇచ్చారు.
'ఆధ్యాత్మిక క్షేత్రం విచ్ఛిన్నం చేయడమే టీడీపీ లక్ష్యంగా చేస్తోంది. తిరుమలలో పాపవినాశనం డ్యాం పవిత్ర జలాలుగా చూస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటే అసలు ఏం జరుగుతోంది' అని వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన ప్రశ్నించారు. 'సనాతన ధర్మం కాపాడుతా అని చెప్పిన పవనా నంద (పవన్ కల్యాణ్) స్వామి ఎక్కడ? ఆయన పరిధిలో ఉన్న అటవీ శాఖ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మౌనంగా ఉంటూ సనాతన ధర్మం ఎలా కాపాడుతారు?' అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









