Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు..

Posani Krishna Murali: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను గతంలో ఇబ్బంది పెట్టిన ప్రత్యర్ది పార్టీల లీడర్లను అదును చూసి దెబ్బ కొడుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ తో మొదలైన ఆ అరెస్ట్ ల పర్వం మహా శివరాత్రి రోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తో పీక్స్ చేరింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2025, 07:58 AM IST
Posani Krishna Murali:  పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు..

Posani Krishna Murali: 2024 ఎలక్షన్ టైమ్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసారు ప్రముఖ నటుడు  వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్యలపై పోసాని కృష్ణ మురళి నోరు పారేసుకున్నారు. అంతేకాదు అంతకు ముందు పలు సందర్భాల్లో వీలు చిక్కినపుడల్లా తెలుగు దేశం, జనసేన అధినేతలపై తన నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పోసానిపై పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే కదా. ఎట్టకేలకు ఆయా కేసులకు సంబంధించి పోలిసులు రంగంలోకి దిగి పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా పోలీసులు పోసాని అడిగిన ప్రశ్నలకు పోసాని లవ్ యూ రాజా అంటూ తనదైన శైలిలో  సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు పోసానిని సుదీర్ఘంగా విచారించారు. అంతేకాదు  విచారణలో పోలీసులు పోసాని సహకరించడం లేదని చెబుతున్నారు. పలు మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడిన క్లిప్పింగ్స్ ను పోసాని ముందు పెట్టి అడిగినా..  తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా అంటూ లవ్ యూ రాజా అంటూ వ్యంగ్యంగానే సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేననన్నారు. అప్పట్లో వైసీపీ పెద్దలు చెప్పిన డైరెక్షన్ లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను విమర్శించినట్టు చెప్పారు. తాను అప్పట్లో చేసిన వ్యాఖ్యలకు పశ్చాతాప పడుతున్నట్టు చెప్పుకొచ్చరు.

ముఖ్యంగా పోసాని కృష్ణమురళి ఓ కులానికి చెందిన వాళ్లనే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగెట్టేలా పోసాని పలు సందర్బాల్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈయన్ని అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు కోర్టులో హాజరు పరచగా.. పోసానికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. గురువారం రాత్రి 9.30 గంటల నుంచి శుక్రవారం 5 గంటలకు వరకు ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇక పోసాని తరుపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి బలమైన ఆర్గ్యుమెంట్ చేశారు.

భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం 41 ఏ కింద ముందుగా నోటీసు ఇచ్చి బెయిట్ ఇవ్వాలని కోర్టుకు లో వాదించారు. అందుకు మేజిస్ట్రేట్ మార్చి 12 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోసానిని పోలీసులు కడప కేంద్ర కారాగారానికి తరలించనున్నారు.

బీఎన్‌ఎస్‌ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్‌ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మేజిస్ట్రేట్‌ 14 రోజుల వరకు రిమాండ్‌ విధిస్తూ తీర్పునిచ్చారు. మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. పోసాని కృష్ణమురళిని కడప కేంద్రకారాగానికి తరలించే అవకాశం ఉంది.

ఓబులవారి పల్లి మండటం కొర్లకుంటుకు చెందిన జేఎస్పీ లీడర్  జోగినేని మణి ఫిర్యాదు పై ఈ నెల 24న పోలీసులు కు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోసానిపై 196, 353(2)చ 111 రెడ్ విత్ 3(5) సహా పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇక పోలీసులు ఈ నెల 26న మహా శివరాత్రి రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఓబులావారి పల్లె పోలీస్ స్టేషన్ కు  తరలించారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

అయితే గత ప్రభుత్వ హయాములో కూడా పలువురు టీడీపీ నేతలు గవర్నమెంట్ కు  వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం పొలిటికల్ గా విమర్శలు చేసినా.. భూతద్దంలో చూపెడుతూ తమ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్ష్య సాధిస్తుందంటూ వాదిస్తోంది. మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఏపీలో పోలీస్ కంప్లైంట్ పైల్ అయింది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమంగా దుర్భాషలాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో  పోస్టులు పెడుతున్న వారిని టార్గెట్ చేస్తూ దూసుకుపోతుంది.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News