లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ పై ఉత్కంఠత ; రాత్రికి నిర్ణయం ప్రకటిస్తానన్న ఈసీ

                                 

Last Updated : Mar 26, 2019, 08:56 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ పై ఉత్కంఠత ; రాత్రికి నిర్ణయం ప్రకటిస్తానన్న ఈసీ

ఎన్టీఆర్ బయోపిక్ గా తెరపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'పై విడుదలపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నారు. విడుదలకు సిద్ధమౌతున్న తరుణంలో ఈ చిత్రానికి అడగడుగున అడ్డంకులు ఎదురౌతున్నాయి . ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఎన్నికల సంఘానికి ఎన్నో ఫిర్యాదులు  అందాయి. 

ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది... సినిమాపై అందిన ఫిర్యాదులను పరిశీలించి విడుదల విషయంలో రాత్రికల్లా ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో  లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ పై ఉత్కంఠత నెలకొంది

'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' మూవీలో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రను నెగిటివ్ గా చూపించారనే టాక్ ఉంది. ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే అది తమ పార్టీపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుందని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. 
 

Trending News