close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఆత్మకూరు కథేంటి ..ఎందుకీ రగడ ?

''ఛలో ఆత్మకూరు'' కార్యక్రమంతో పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయాలు మరో మారు వెలుగులోకి వచ్చాయి. 

Updated: Sep 11, 2019, 01:30 PM IST
 ఆత్మకూరు కథేంటి ..ఎందుకీ రగడ ?

పల్నాడులోని మారుమూల గ్రామమైన ఆత్మకూరు అంశంపై ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.  చంద్రబాబు 'ఛలో ఆత్మకూరు'కు పిలుపునివ్వడంతో అందరి చూపు ఆ గ్రామం వైపు మళ్లింది. ఇంతకీ అసలు ఆత్మకూరులో ఏం జరిగింది.. టీడీపీ ఎందుకు  ''ఛలో ఆత్మకూరు'' కు పిలుపునిచ్చింది. టీడీపీకి ధీటుగా  వైసీసీ వారు కూడా ఛలో ఆత్మకూరు నినాదాన్ని ఎత్తుకున్నారు. అనేది తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

ఆత్మకూరు ప్రస్థానం

గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఆత్మకూరులో ఆది నుంచీ  ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో  ఘర్షణ చెలరేగడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఏదో ఒక సందర్భంలో ఫ్యాక్షన్ మహమ్మారి పడగవిప్పుతూనే ఉంది. ఇలా ఆ గ్రామానికి ఫ్యాక్షన్ మరకపడింది. సుమారు 3 వేల మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలుగా విడిపోయి ఘర్షణలు పడుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఇక్కడ ఫ్యాక్షన్ రాజీకీయాలు తారా స్థాయికి చేరాయి. ఈ అంశం మీడియా ద్వారా వెలుగు ద్వారా వెలుగు చూసింది. 

గ్రామం వదిలి వెళ్లిపోయిన బాధితులు

ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఇటీవలె ఆత్మకూరులో చెలరేగిన ఘర్షణలకు భయపడి టీడీపీకి చెందిన 70 కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లి బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నాయి. బాధిత కుటుంబాలన్నీ దుర్గి, వెల్దుర్తి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని బంధువుల ఇళ్ళల్లో ఉంటూ అక్కడే ఏదో ఒక పనిచేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. 

కేసులు నమోదు చేయలేదంటూ టీడీపీ ఆరోపణ

తమను గ్రామం విడిచి వెళ్లిపోవాలని పోలీసులే ఆదేశించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా ఇల్లు విడిచి వెళ్లినప్పటికీ తమ వర్గం వారి ఇళ్ల తాళాలు  పగలగొట్టి  వైసీపీ వర్గీయులు విధ్వంసం సృష్టించారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వర్గానికి చెందిన వారిపై వైసీపీ మద్దతుదారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని విమర్శిస్తున్నారు. తమపై దాడులు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయడంలో కూడా శ్రద్ధ చూపించలేదని టీడీపీ వారు విమర్శిస్తున్నారు.

చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన టీడీపీ శ్రేణులు

ఇదిలా ఉంటే బాధిత కుటుంబాలు చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆత్మకూరులోనే గాక పల్నాడులో పలు చోట్ల తమ పార్టీ వారిని వైసీపీ వర్గీయలు ఊళ్ల నుంచి తరిమికొట్టారన్న విషయం టీడీపీ శ్రేణులు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ నేతల బృందాలు జిల్లా ఎస్పీతో పాటు స్థానిక పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని ఆరోపించిన చంద్రబాబు భాదిత కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు బుధవారం చలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చారు. దాడుల భయంతో గ్రామం వదిలి వెళ్లిపోయిన ఆత్మకూరు వాసులను స్చేచ్ఛగా తమ గ్రామంలో నివసించే పరిస్థితులు కల్పించాలని చంద్రబాబు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ-టీడీపీ పోటా పోటీ ధర్నాలు

మరోవైపు వైసీపీ వారు కూడా ఛలో ఆత్మకూరు నినాదం ఎత్తుకున్నారు. చంద్రబాబు హయంలో వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు.  టీడీపీ నేతలు కోడెల, యరపతినేని బాదితులతో కలిసి టీడీపీ ర్యాలీకి పోటీగా ర్యాలీ నిర్విహిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ఘర్షణలకు ఆజ్యం పోసింది చంద్రబాబే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు హయంలో వైసీపీ నేతలు,కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి టీడీపీలోకి బలవంతంగా చేర్చుకున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే పల్నాడు ప్రాంతంలో అలజడులు రేగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.