close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

కోడెల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వద్దంటున్న  కుటుంబ సభ్యులు !! 

ఏపీ మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామన్న ఏపీ సర్కార్ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు.

Updated: Sep 18, 2019, 01:09 PM IST
కోడెల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వద్దంటున్న  కుటుంబ సభ్యులు !! 

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత  కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం నరసరరావుపేటలో నిర్వహించున్నారు.  మధ్యాహ్నం 1 గంట తర్వాత పట్టణంలోని స్వర్గ పూరి శ్మశాన వాటికలో అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలు  ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  అయితే కోడెలకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు వద్దంటున్నారు ఆయన కుటుంభసభ్యులు. టీడీపీ నేతలు, కార్యకర్తలతోనే కోడెలకు అంత్యక్రియలు జరుపుకుంటామని చెబుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేత జీవి ఆంజనేయలు మీడియాకు తెలిపారు.