Daughter Raped: కన్న తండ్రే కామాంధుడు.. నొప్పిగా ఉందన్న కొన్ని నెలలుగా అత్యాచారం.. ఎక్కడంటే..?

Ap Crime news: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి పశువుగా మారాడు. తన కూతురిపై నెలల తరబడి అత్యాచారం చేస్తున్నాడు. దీంతో ఇటీవల యువతి తన బాధను స్కూల్ లో చెప్పుకుంది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 12, 2025, 06:23 PM IST
  • కూతురును అత్యాచారం చేసిన తండ్రి..
  • పోక్సోకేసు నమోదు చేసుకున్న పోలీసులు..
Daughter Raped: కన్న తండ్రే కామాంధుడు.. నొప్పిగా ఉందన్న కొన్ని నెలలుగా అత్యాచారం.. ఎక్కడంటే..?

Father raped daughter in rajamahendravaram: కామాంధులు పశువుల కన్నహీనంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా మారడం లేదు. బస్టాండ్, రైల్వే, మెట్రోలు, విమానం, పని ప్రదేశాల్లో మహిళలకు వేధింపులకు గురిచేస్తున్నారు. మొత్తంగా మహిళలను, అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని వేధింపుల పర్వంకు కారణమౌతున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ప్రస్తుతం ప్రతిరోజు కూడా మహిళల అఘాయిత్యాలకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. యువతులు ఎంత జాగ్రత్తగా ఉన్న కూడా కామాంధులు బారి నుంచి తప్పించుకోలేక పోతున్నారు. చివరకు కంటికి రెప్పలా కాపాడాల్సిన ఇంట్లో వాళ్లు సైతం వేధింపులకు పాల్పడుతున్నారు. కన్న తండ్రి, కాపాడాల్సిన సోదరుడు సైతం.. తన వాళ్లను అత్యాచారం చేసిన ఘటనలు వార్తలలో నిలిచాయి.

చివరకు అన్యాయం  జరిగిందని పోలీసుల దగ్గరకు వెళ్తే.. అక్కడ కూడా కొంత మంది పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు.ఈ క్రమంలో ఏపీలో కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

ఆంధ్ర ప్రదేశ్ లోని  రాజమహేంద్ర వరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా మెకానిక్ గా పనిచేసే వ్యక్తికి 17 ఏళ్ల క్రితం పెళ్లైంది. కొన్నేళ్లపాటు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత అనూహ్యంగా.. గొడవలు రావడంతో.. అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తన ముగ్గురు కూతుళ్లతో అక్కడే ఉంటుంది. అయితే.. ఇటీవల పెద్ద కూతురు తండ్రి వద్ద ఉంటూ స్కూల్ కు వెళ్తుంది.

ఆమె ఎనిమిదో తరగతి. గతంలో ఆమె తండ్రి ఒకసారి ఆమెపై తాగిన మైకంలో అత్యాచారంకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెపై తరచుగా అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల ఆమె స్కూల్ లో డల్ గా ఉండటం చూసి ఆమె స్నేహితురాళ్లు , టీచర్లు ఆరాతీశారు. దీంతో తన తండ్రి ఘాతుకం బైటపెట్టింది.

Read more: Viral Video: రెచ్చిపోయిన కేటుగాడు.. మంచి నీళ్లు అడిగి ఇంట్లోకి ప్రవేశించి.. వైరల్‌గా మారిన వీడియో..

ఈ క్రమంలో ప్రస్తుతం..వాళ్లంతా పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. కామాంధుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన మాత్రం స్థానికంగా సంచలనంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News