Fire accident in tirumala near srivari padalu video: తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. కంపార్ట్ మెంట్ లు అన్ని కూడా భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ముఖ్యంగా సమ్మర్ సెలవుల ముగింపుకు వస్తుండటంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తిరుమలలో అగ్నిప్రమాదం సంభవించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
శ్రీవారి పాదాలు, శిలా తోరణం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. దీంతో భక్తులు తీవ్రంగా ఆందోళన చెంది టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే భారీ ఎత్తున దట్టమైన పొగ పెద్దగా వ్యాపించాయి.
🚨 BREAKING NEWS 🚨
తిరుమలలో అగ్నిప్రమాదం
తిరుమల శ్రీవారి పాదాల సమీపంలో చెలరేగిన మంటలు
శేషచల కొండల్లో అగ్నిప్రమాదం.. మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది#AndhraPradesh #Tirumala #FireAccident pic.twitter.com/wwRZrhBZ7w
— Telugu Feed (@Telugufeedsite) June 10, 2025
ఘటన గురించి తెలియగానే.. రెండు ఫైరింజన్ లను రప్పించి అగ్ని కీలలు మరింత వ్యాప్తి చెందకుండా.. ఫైర్ సిబ్బంది ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు సకాలంలో అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.
Read more: Tirumala: విద్యార్థులకు టీటీడీ అద్భుత అవకాశం.. ఈ నెల 16 నుంచి 19 వరకు ప్రత్యేకం..!
అప్పటికే ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ ఘటనతో భక్తులు తిరుమలలో ఈ వరుస ఘటనలు ఏంటని తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మంటకు కారణంఏంటని అధికారులు విచారణ చేపట్టారు.
తిరుమలలో ఇటీవల అనేక ఆందోళనలు కల్గించే ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల లడ్డు తయారీ చేసే ప్రదేశంలో కూడా కొన్ని నెలల క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. ఆతర్వాత వైకుంఠ ఏకాదశి వేళ టికెట్ల కోసం రద్దీఎక్కువై.. తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు తక్కువ ఎత్తులో వెళ్తునే ఉన్నాయి.
తిరుమలలోమద్యం , మాంసంను, ఇతర మత ప్రచారంకు చెందిన వాటిని టీటీడీ విజిలెన్స్ కు చిక్కకుండా కొండపైకి తీసుకొని వెళ్తున్నారు. కొంత మంది పనుల వల్ల శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోలనలు వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి వివాదాస్పద పనులు చేయోద్దని భక్తులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook