
Former minister Rk roja sensational comments on ap Chandrababu naidu govt: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఏపీ ఇంటెలీజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేసిన విధానంపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని సీరియస్ అయ్యారు. అక్రమంగా కేసులు బనాయిస్తున్న ఏ ఒక్క పోలీసును వదలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు కూటమి నీచంగా.. చెత్త డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ చేస్తుందని రోజా శివాలెత్తిపోయారు. స్కిల్ స్కామ్ కేసును పక్కతోవ పట్టించేందుకు.. కాదంబరీ జెత్వానీ ఘటనను హైలేట్ చేస్తున్నారని అన్నారు. ఈరోజు ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను అరెస్ట్ చేసిన విధానం కూడా దారుణమన్నారు.
PSR ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం అంటే డైవర్షన్ డట్టి పోలిటిక్స్ కు పారాకాష్ట
తప్పు చేయని అంజనేయులు గారిని మీరు అరెస్ట్ చేస్తే.. రెడ్ బుక్ ను అనుసరిస్తూ తప్పుడు కేసులు పెడుతున్న మిమ్మల్ని ఏమి చేయాలి? - మాజీ మంత్రి @RojaSelvamaniRK pic.twitter.com/Evtcl7LqAg
— greatandhra (@greatandhranews) April 22, 2025
ఎప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉండదని.. వచ్చేది జగనన్న ప్రభుత్వమన్నారు. ఇప్పుడు చేసిన అక్రమాలు అన్నింటికి కూడా అప్పుడు రిటర్న్ గిప్ట్ ఉంటుందన్నారు. అంతేకాకుండా.. ప్రధాని మోదీకి చిత్త శుద్ది ఉంటే.. స్కిల్ స్కామ్ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే జెత్వానీ కేసులో.. విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ విశాల్ గున్నీ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
జెత్వానీ వ్యవహారంలో వీరంతా కీలంగా వ్యవహరించినట్లు కూడా పోలీసులు పలు ఆధారాలుచేపట్టారు. మొత్తంగా ఒక్క స్కెచ్ ప్రకారమే..కాదంబరీ జెత్వానినీ అక్రమంగా కేసుల్లో ఇరికించినట్లు విషయం బైటపడింది. ఈ ఘటన ప్రస్తుతం ఏపీరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe