Ys Jagan Coterie: సాయిరెడ్డి చెప్పిన ఆ కోటరీ ఎవరు, వైవీ సుబ్బారెడ్డిని వైఎస్ ఎందుకు చేరనివ్వలేదు

Ys Jagan Coterie: ఇటీవల వైసీపీకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మనసులో తాను లేనందునే పార్టీలో ఉండదల్చుకోలేదన్న సాయిరెడ్డి..కోటరీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏపీలో ఇదే హాట్‌టాపిక్ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2025, 08:47 PM IST
Ys Jagan Coterie: సాయిరెడ్డి చెప్పిన ఆ కోటరీ ఎవరు, వైవీ సుబ్బారెడ్డిని వైఎస్ ఎందుకు చేరనివ్వలేదు

Ys Jagan Coterie: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. జగన్ చుట్టూ కోటరీ ఉందనే విషయం గతంలో కొంతమంది చెప్పినా వాటికంత ప్రాధాన్యత రాలేదు. ఇప్పుడు చెప్పింది విజయ సాయి రెడ్డి కావడంతో చర్చకు దారితీస్తోంది. 

Add Zee News as a Preferred Source

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ దాటే అవకాశం లేదని విజయసాయి రెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. విజయసాయి రెడ్డి చెప్పిన కోటరీ ఎవరనే చర్చ మొదలైంది. విజయసాయి రెడ్డి చెప్పిన కోటరీ అంటే వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అని పరోక్షంగా చెప్పినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్‌ కు కలవాలంటే కోటరీ దాటుకుని వెళ్లాల్సిందేనని, జగన్ చెప్పుడు మాటలు వింటున్నారని చెప్పడం కూడా వైవీ సుబ్బారెడ్డి అండ్ సజ్జల గురించేనని తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తనను తొలగించడానికి కారణం కూడా వైవీ సుబ్బారెడ్డి అనేది విజయసాయి రెడ్డి అభిప్రాయంగా ఉంది. వైవీ సుబ్బారెడ్డి వల్లనే తాను దూరమయ్యానని చెప్పకనే చెప్పారు. 

ఎందుకంటే వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభకు ఎన్నికైన తరువాతే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. దాదాపు పదేళ్లు ఢిల్లీలో తన మాట చెల్లుబాటవడం, వైవీతో ఆ ప్రాధాన్యత తగ్గడాన్ని సాయిరెడ్డి నిశితంగానే గమనించారు. వైవీని టార్గెట్ చేసేందుకే కాకినాడ సీ పోర్టు విషయంలో వైవీ కుటుంబాన్ని సాయిరెడ్డి ఇరికించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కేవీ రావు, శరత్ చంద్రారెడ్డి మధ్య డీల్ సెట్ చేసింది వైవీ కుమారుడు విక్రాంత్ రెడ్డి అని విజయసాయి రెడ్డి చెప్పడమే ఇందుకు ఉదాహరణ. 

వైవీ సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తనపై లేనిపోనివి చెప్పి జగన్ మనసు మార్చారని..అందుకే ఆ మారిన మనసులో తాను లేనని సాయిరెడ్డి ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. 

వైవీ సుబ్బారెడ్డి అలాంటి వ్యక్తేనా

వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డి నేపధ్యం అంత గొప్పది కాదు. కేవలం వైఎస్ఆర్ తోడల్లుడు అనే బంధుత్వం తప్ప మరేదీ లేదు. బహుశా అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ వైవీ సుబ్బారెడ్డిని రాజకీయంగా దగ్గరకు రానిచ్చిన పరిస్థితి లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడయితే వైవీ సుబ్బారెడ్డిని బంధుత్వం వరకే పరిమితం చేశారు. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాల్లో వైఎస్ జగన్ సొంత పార్టీ స్థాపించిన తరువాత వివేకానందరెడ్డి వంటి సొంత వ్యక్తులు వెంటనే పార్టీలో చేరలేదు అదే అదనుగా వైవీ సుబ్బారెడ్డి జగన్‌కు చేరువయ్యారు. 

Also read: AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్ష ఎప్పుడు ఎలా అప్లై చేయాలి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News