Tragedy In Gowshala: మొదట బావిలోకి దిగిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురయి మరణించగా బయటకు రాలేదు. అయితే ఈ సంఘటన తెలియని మిగతా వాళ్లు అతడిని రక్షించేందుకు బావిలోకి దిగారు. వాళ్లు కూడా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెదకాకానిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Jallikattu: సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో తీవ్ర విషాదం.. జల్లికట్టులో యువకుడి మృతి
గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ కాళీవన ఆశ్రమ గోశాల వద్ద విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఆశ్రమంలో గోవుల వ్యర్ధాలను మోటర్ ద్వారా బయటకు పంపించేందుకు సోమవారం ఓ వ్యక్తి ఇనుప నిచ్చెన సాయంతో బావిలోకి దిగారు. విద్యుదాఘాతానికి గురయిన అతడు బావిలోనే చనిపోయాడు. ఈ విషయం తెలియక అతడిని రక్షించేందుకు వరుసగా ముగ్గురు వ్యక్తులు బావిలోకి దిగి మృత్యువాతపడ్డారు.
Also Read: GV Reddy Resign: టీడీపీకి ఊహించని షాక్.. జీవీ రెడ్డి రాజీనామా
ఆశ్రమంలో దాదాపు 70 ఆవులు ఉంటాయి. తరచూ గోవుల వ్యర్ధాలను మోటర్ ద్వారా బయటకు పంపిస్తూ ఉంటారు. ఆ విధంగానే సోమవారం వ్యర్థాలను బయటకు పంపించేందుకు ఒక వ్యక్తి ఇనుప నిచ్చెన సాయంతో బావిలోకి దిగగా.. అనంతరం మరో ముగ్గురు అలాగే దిగడంతో వారంతా విద్యుత్ షాక్‌కు గురయి బావిలోనే చనిపోయారు. దిగిన వారు దిగినట్టే ఉండిపోయి బయటకు రాకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులకు అనుమానం వచ్చి చూడగా ముగ్గురు విగతజీవులుగా బావిలో పడి ఉన్నారు. వెంటనే మోటార్ ఆఫ్ చేసి దిగి చూడగా వారంతా చనిపోయారు.
వెంటనే గోశాల నిర్వహకులు పెదకాకాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నలుగురు మృత్యువాత చెందారని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ వివరాలు సేకరించారు. మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదంపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుల్లో ముగ్గురు తెనాలి ప్రాంతానికి చెందినవారు కాగా.. మరొ వ్యక్తి సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









