)
woman argument with bus driver in Kadapa video: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు సైతం ఉచిత బస్సు ప్రయాణంను అమలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ఫ్రీబస్సు జర్నీకి మంచి స్పందన వస్తుంది. ప్రతిరోజు కూడా మహిళలు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఫ్రీబస్సు సర్వీసును ఉపయోగించుకుంటున్నారు. ఈ జర్నీని కొంత మంది మిస్ యూజ్ చేసుకుంటున్నారు.
మొత్తంగా కొంత మంది అవసరంలేకున్న బస్సులో జర్నీలు చేస్తు.. డ్రైవర్ లు, కండక్టర్ లతో గొడవలు పడుతున్నారు. జుట్లు పట్టుకుని మరీ కొట్టుకొవడం వంటివి చేస్తున్నారు. ఇదంతా మనం డైలీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలోని కడప జిల్లాలో మహిళ బస్సు డ్రైవర్ తో వాగ్వాదంకు దిగింది. ఈవీడియో వైరల్‌గా మారింది.
ఏపీలో బస్సు ఆపలేదని మహిళ ఆవేదన
కడప జిల్లా సిద్ధవటం మండలం భాకరాపేట క్రాస్ రోడ్డు వద్ద బస్సు డ్రైవర్ తో గొడవకు దిగిన మహిళ
ప్రయాణికులతో రద్దీగా ఉందని బస్సు ఆపకుండా వెళ్తున్న డ్రైవర్
దీంతో మహిళ ఆగ్రహించి గంటల తరబడి బస్టాండ్ వద్ద వేచి ఉన్నా ఒక్క బస్సు కూడా ఆపలేదని ఆవేదన
చివరికి… pic.twitter.com/jr98Bwt3MB
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2025
ప్రస్తుతం దసరా పండగ సీజన్ నడుస్తొంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిట కిటలాడుతున్నాయి. అంతే కాకుండా.. జనాలు తమ సొంతూర్లకు వెళ్లడానికి భారీగా బస్టాండ్ లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ లు అన్ని ప్రయాణికులతో కిట కిటలాడుతున్నాయి. అయితే.. ఏపీలోని కడప జిల్లాలో ఒకమహిళ డ్రైవర్‌తో వాగ్వాదంకు దిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కడప జిల్లా సిద్ధవటం మండలం, భాకరాపేట క్రాస్ రోడ్డు వద్ద మహిళ బస్సు డ్రైవర్ తో గొడవకు దిగింది. చాలా సేపటి నుంచి బస్సుల కోసం చూసిన అక్కడి వారు చివరకు వచ్చిన బస్సు కూడా ఆగకుండా వెళ్లేందుకు ప్రయాణించడంతో ఆమె సీరియస్ అయ్యింది. ప్రయాణికులు ఇంత మంది ఉంటే.. కన్పించడంలేదా అంటూ డ్రైవర్ ను ఏకీపారేసింది.
చివరకు డ్రైవర్ సీటు గుండా ఎక్కి, కొంత సేపు అక్కడ కూర్చుని డ్రైవర్ తో వాగ్వాదంకు దిగింది. ఆ తర్వాత బస్సు లోపలికి వెళ్లింది. అక్కడున్న కొంత మంది ఈ ఘటనను వీడియో తీసి వైరల్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మహిళలు బస్సు డ్రైవర్లు, మగాళ్ల మీద పగపట్టారా..?.. ఏంటీ అంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook