Intintiki Mana Mitra Programme: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ.. పరిపాలన వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు వాట్సాప్ గవర్నెన్స్. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు.. పథకాలను అందిస్తుండగా తాజాగా ఆ సేవలను విస్తృతం చేయడానికి మరో ముందడుగు వేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటింటికీ మన మిత్ర కార్యక్రమం అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాట్సస్ సేవలపై సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్నారు.
Also Read: Mark Shankar Health: తన కొడుకు పరిస్థితి వివరించి భావోద్వేగానికి లోనైన పవన్ కల్యాణ్
ప్రతి పౌరుడి ఫోన్‌లో 95523 00009 నంబర్ మన మిత్రపేరిట సచివాలయ సిబ్బంది సేవ్ చేయనుంది. మన మిత్ర పేరిట కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లకు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రం, వీడియో సందేశం వినిపించనున్నారు. ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునేలా కార్యక్రమ రూపకల్పన చేయనున్నారు. ఈ మేరకు ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
Also Read: YS Jagan: 'డొనల్డ్ ట్రంప్ మీద నెట్టేసి సీఎం చంద్రబాబు నిద్రపోతున్నారా?'
ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 250కి పైగా సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. జూన్ నెలకు 500కు పైగా సేవల అందించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. తదుపరి దశలో వెయ్యికి పైగా సేవల కల్పించాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా విధించుకుంది. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా వాట్సాప్ గవర్నెన్స్‌ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా అమలుపై దృష్టి సారించారు. ప్రజలకు మరింత వాట్సప్ గవర్నెన్స్‌ను అమలు చేసేందుకు మన మిత్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు వేసుకుంది. చదువు రాని వారు కూడా కేవలం తమ వాయిస్ మెసెజ్ ద్వారా కూడా పనిచేసేలా ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఏర్పాటు చేస్తున్నారు.
పౌరులందరూ తమ మొబైల్ ఫోన్‌లో మనమిత్ర పేరిట 95523 00009 నంబరును సేవ్ చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే వాట్సప్ సేవలు కొంత దుర్వినియోగం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాలు.. వివిధ ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విద్యార్థులు, వివిధ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు పొందాలనుకునే వాట్సప్ ద్వారా పొందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









