)
Tadipatri Ganesh Shobhayatra: అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో వర్గపోరు భగ్గుమన్నది. పవిత్రంగా.. భక్తిశ్రద్ధల మధ్య జరగాల్సిన గణేశ్ శోభాయాత్ర రణరంగంగా మారింది. వినాయకుల ఊరేగింపులో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కర్రలు.. రాళ్లతో దాడి చేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో చోటుచేసుకుంది. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా వారి మధ్య భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయి. ఆ విభేదాలు వినాయక ఉత్సవాల కేంద్రంగా భగ్గుమన్నాయి. వినాయక నిమజ్జనం తాడిపత్రిలో ఆదివారం జరిగింది. వినాయక విగ్రహాలు ఆనందోత్సహాల మధ్య ఊరేగింపు జరుగుతుండగా.. జేసీ, కాకర్ల వర్గాలు పరస్పరం ఎదురుపడ్డాయ.
కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య వర్గ విభేదాలు మనసులో పెట్టుకున్న రెండు వర్గాలు వినాయక నిమజ్జనం ఊరేగింపులో పరస్పరం దాడి చేసుకున్నాయి. 'జై జేసీ' అంటూ ఓ వర్గం నినాదాలు చేయగా.. ప్రత్యర్థి 'జై కాకర్ల' అంటూ నినాదాలు చేయడంతో వివాదం మొదలైంది. అనంతరం ఇరు వర్గాలు పరస్పరం పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇరువర్గాలు మధ్య పరస్పరం ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పలు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు.
ఒక్కసారిగా పరిస్థితి రణరంగంగా మారడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం మిగతా విగ్రహాల వాహనాలను ముందుకు కదిలించారు. నిమజ్జనం సాఫీగా జరిగేందుకు పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఇరు వర్గాల ఘర్షణలో జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.