Gangamma Jathara: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి అనంతపురం గ్రామ గంగమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా గంగమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్నారురు. గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత వేసవికాలంలో గ్రామాలలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేలా గంగమ్మ తల్లి దీవెనలు ఉండాలన్నారు. గంగమ్మ జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా ఆ తల్లిని కోరుకున్నట్టు తెలిపారు మంత్రి రాంప్రసాద్.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇక రాయలసీమలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. రాయలసీము రతనాల సీమ అని పిలుస్తుంటారు కదా. ఇక్కడ ఒకపుడు రతనాలు పండే పొలాలకు ప్రసిద్ధి. కానీ ఇక్కడ కరువు తాండవం చేస్తుంది. రాజస్థాన్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతం కూడా రాయలసీమలోనే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాల్లో సమృద్దిగా వర్షాలు పడాలనే ఉద్దేశ్యంతో గంగమ్మ కు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో వర్షాల వలన ప్రజలు కరువు కాటకాల బారిన పడకుండా ఉంటారనది నమ్మకం. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో కూడా మన సంస్కృతిలో నిలయమైన గంగమ్మ జాతరను చూపెట్టడం విశేషం.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









