Guntur Mayor: గుంటూరు మేయర్ సీటుపై నజర్.. టీడీపీ ప్లాన్ ఇదే..!

Guntur Mayor: ఆంధ్ర ప్రదేశ్ లో కొలువైన కూటమి ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో విజయమ వ్యూహంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేసిన ఎన్డీయే కూటమి.. ఇపుడు గుంటూరు మేయర్ పీఠంపై కన్నేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 16, 2025, 10:39 AM IST
Guntur Mayor: గుంటూరు మేయర్ సీటుపై నజర్.. టీడీపీ ప్లాన్ ఇదే..!

Guntur Mayor: గుంటూరు నగర పాలక సంస్థ మేయర్‌ పదవికి కావటి శివనాగ మనోహర్‌నాయుడు రాజీనామా చేశారు. దీంతో ఈ సీటను కైవసం చేసుకోవడానికి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అపుడే వ్యూహాలకు పదును పెట్టింది. 2021లో వైసీపీ నుంచి మనోహర్‌నాయుడు మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే పదవికి రాజీనామా చేశారు.

Add Zee News as a Preferred Source

తాను చివరి శ్వాస వరకు వైసీపీలోనే కొనసాగుతానన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన సాగుతోందని, కూటమి నాయకుల అవమానాలు భరించలేకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన కారు డ్రైవర్‌ను, సిబ్బందిని కూడా పూర్తిగా తొలగించారన్నారు.

మరోవైపు గత కొంతకాలంగా నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులు, మేయర్‌ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. మరో వైపు ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో.. ఆరు స్థానాల్లో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. ఈనెల 17న స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే మనోహర్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News