బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇస్తూ చంద్రబాబుకు సవాల్ విసిరిన జీవీఎల్
ఏపీలో బీజేపీ పొత్తులపై రాజ్యసభ సభ్యుడు కేవీఎల్ స్పందించారు.
విశాఖ: ఏపీలో బీజేపీ పొత్తులపై రాజ్యసభ సభ్యుడు కేవీఎల్ స్పందించారు. ఏపీలో మోడీని ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్న జీవీఎల్... వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తలుండవని తేల్చి చెప్పారు. లోక్ సభ స్థానాలతో పాటు రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పారు. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధులను ఎంపిక చేస్తామన్నారు. కొన్ని బలమైన స్థానాలు గుర్తించి నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని జీవీఎల్ పేర్కొన్నారు.
చంద్రబాబుకు సవాల్
ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా జీవీఎల్ విసిరారు. కుల రాజకీయాలు, అవినీతిపై చర్చకు ముందుకు వచ్చేందుకు చంద్రబాబు సిద్దమా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో కాదు అవినీతిలో ముందున్నాయి. అమరావాతిలో అభివృద్ధి జరగలేదు..జనాలకు చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏపీ రాజధానికి కేంద్రం నిధులిస్తే తాక్కాలిక భవనాలకే పరిమితమయ్యారని ఆరోపించారు. విశాఖలో మోడీ పర్యటనకు ఎలాంటి అవసరం లేదని..దేశ ప్రధాని ఎక్కడైన పర్యటించే అధికారం ఉందని జీవీఎల్ వివరించారు