Devotees wear chappals near Tirumala main temple video: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని చాలా మంది కొంగు బంగారంలో భావిస్తారు. పిలిస్తే పలికి దైవంగా చెప్తుంటారు. ఎన్ని కష్టాలు ఉన్నా.. ఆయన పేరు తల్చుకుంటే గట్టేక్కిస్తాడని చాలా మంది భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి ఏడుకొండల స్వామి ఆలయం నేడు తరచుగా ఏదో ఒక వివాదాలలో ఉంటుంది.
తిరుమలలో కొంత మంది రాజకీయాలు మాట్లాడున్నారు. మరికొందరు రీల్స్ తీసుకుంటున్నారు. పవిత్రమైన ప్రదేశంలో మద్యం, మాంసం, అన్యమత ప్రచారం వంటి పాడుపనులు చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ఇప్పటికి అధికారుల కళ్లు కప్పి కొంత మంది నీచంగా ప్రవర్తిస్తున్నారు.
తిరుమలలో అపచారం
శ్రీవారి దర్శనానికి పాదరక్షలతో మహా ద్వారం వరకు వచ్చిన భక్తులుమూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన గుర్తించని టిటిడి విజిలెన్స్
ముగ్గరు భక్తులు పాదరక్షలు ధరించి వచ్చిన మహా ద్వారం గుర్తింపు#AndhraPradesh #TTD pic.twitter.com/ZSFk99ciiL
— Telugu Feed (@Telugufeedsite) April 12, 2025
అయితే.. కూటమి సర్కారు తిరుమలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఒక వైపు సాధారణ భక్తులే ప్రయారిటీగా చర్యలు తీసుకొవాలని టీటీడీని ఆదేశించింది. మరోవైపు శ్రీవారికి చేసే కైంకర్యాలలో ఎలాంటి లోటు పాట్లు ఉండొద్దని కూడా ఆదేశించారు. ఈ క్రమంలో టీటీడీ ఎన్ని పకట్బంది చర్యలు తీసుకున్న కూడా ఇంకా కొంత మంది భక్తులు అధికారుల కళ్లు కప్పి.. అపచారాలకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా.. మరో చోటు చేసుకున్న ఒక ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. తాజాగా.. కొంత మంది భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని తిరుమల శ్రీవారి ముఖ మండపం దాక వచ్చేశారు. దీంతో అక్కడున్న సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు . నిజానికి.. తిరుమల శ్రీవారి దర్శనం నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. కానీ ఆ మూడు స్థానాల్లో కూడా టిటిడి అధికారులు చెప్పుల ఘటనను గుర్తించలేదు.
మరీ ఈ విషయంలో భద్రత సిబ్బంది నెగ్లీజెన్సీగా ఉన్నారా..?.. లేదా భక్తులే ఏదైన చేశారా అన్నదానిపై ప్రస్తుతం టీటీడీ అధికారుల విచారణ చేపట్టారు. మొత్తంగా కొంతమంది భక్తులు చెప్పులు వేసుకుని రావడంపై తోటి భక్తులు కూడా ఆగ్రహాం వ్యక్తం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.
Read more: Hanuman Jayanti: ఆంజనేయుడికి సింధూరం, వడమాల అంటే ఎందుకంత ఇష్టం..?.. ఈ పురాణగాథ మీకు తెలుసా..?
ఇదిలా ఉండగా.. తిరుమలలో ముఖ్యంగా సమ్మర్ లో వచ్చే భక్తులుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. మొత్తంగా అధికారులు చలువ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటి వసతి, అన్నప్రసాదాలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఇటీవల తెలంగాన పొలిటియన్స్ సిఫారసుల కోసం టీటీడీ ప్రత్యేకంగా యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇన్నాళ్లు కొనసాగిన వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్లైంది. ప్రస్తుతం సాఫీగా దర్శనాలు అవుతున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









