CM Chandrababu Wishes To Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎంకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మిత్రులు.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ మాటల్లో పదును, చేతల్లో చేవ జన సైన్యానికి ధైర్యం అంటూ నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని పుట్టినరోజు శుభాకాంక్షలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్‌కు తెలియజేశారు.
అవును పవన్ అంటే అది పేరు కాదు ఒక ప్రభంజనం అని చెప్పాలి.. సంకల్పంతో ఉండడానికి సాటి మనిషికి సాయం చేయడానికి ఆస్తులు అధికారం కాదని నిరూపించారు. ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు సీఎం పవన్ కళ్యాణ్ నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒక్క సీటు లేకుండా పదేళ్లు పార్టీని నడిపారు. పార్ట్ టైం పొలిటిషన్ అంటూ విమర్శలు వచ్చినా కానీ దాన్ని తిప్పి కొట్టి 100 శాతం స్ట్రైక్ రేట్ తో డిప్యూటీ సీఎం అయ్యారు. హేళనలు అవమానాలు తట్టుకొని నిలబడ్డారు. ప్రస్తుతం ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం పదవి.. మరోవైపు నటనకు పూర్తి న్యాయం చేస్తున్నారు.
మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జన సైన్యానికి ధైర్యం... మాటకి కట్టుబడే తత్వం... రాజకీయాల్లో విలువలకు పట్టం....స్పందించే హృదయం...అన్నీ కలిస్తే… pic.twitter.com/TqlmiEIwBZ
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2025
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయాల్లో విలువలకు పట్టం అన్ని కలిస్తే పవనిజం అనే అభిమానులు కార్యకర్తలు ప్రజల దీవెన కూడా ఆయనకు కలగాలని రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా మంత్రి నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన పీపుల్ స్టార్ గా ఎదిగారని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారని ప్రశంసించారు. సొంత తమ్ముడి కంటే ఎక్కువగా తనను పవన్ అభిమానిస్తారని అండగా నిలుస్తారని పవన్ అన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పారు.
వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు… pic.twitter.com/QEKiv9mInU
— Lokesh Nara (@naralokesh) September 2, 2025
ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ పై నిర్మిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించిన పోస్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్, హ్యాట్ ధరించి కనిపిస్తున్నారు. ఆయన లుక్ కూడా ఎంతో గ్లామరస్ గా మైకల్ జాక్సన్ పోజులో కనిపించారు. నిన్నటి నుంచి ఈ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు బర్త్ డే ట్రీట్ అని చెప్పొచ్చు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాఖీ కన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Ustaad of Style, Swag & Box-office ??
Here is the WWM picture ❤?
HD picture and DP?https://t.co/BwMPLMff5V#UstaadBhagatSingh pic.twitter.com/7oYsCVw86H
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) September 1, 2025
Read more: అత్యంత విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆ గ్రామంలో 1000 మంది మృత్యువాత..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









