Heavy Rains: దంచి కొడుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం ఇచ్చే శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ ఏప్రిల్ 3 తరువాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో వచ్చే రెండు నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్ 3న వడగండ్ల వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనగామ మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణ జిల్లాల్లో 40డిగ్రీలకుప పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రజలు ఎండ వేడికి అల్లాడుతున్నారు. పగలు తీవ్రమైన ఎండ, వేడిగాలులకు చిన్న పిల్లలు, వృద్దులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. అంతేకాదు బయట కాలు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త రిలాక్స్ అయ్యే అవకాశాలున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









