)
Heavy Rains Alert: దసరా పండుగ సందర్భంగా అందరూ గ్రామాలకు వెళ్లి ఆనందంగా ఉండగా వాతావరణ శాఖ బాంబు పేల్చింది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దాని ప్రభావం ఏపీ ఉంటుందని చెప్పారు.
మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఎల్లుండికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావం వర్షాలు పడే అవకాశం ఉండడంతో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ ప్రభావం కారణంగా రేపు ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం
==> శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు.. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
==> తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
ఇప్పటివరకు నమోదైన వర్షపాతం
మంగళవారం సాయంత్రం 6 గంటలకు అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 40.5 మి.మీ, కృష్ణా జిల్లా పెడనలో 39.5 మి.మీ, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 34.7 మి.మీ, నర్సీపట్నం, కాకినాడలో 34 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
నదుల ప్రవాహం
==> కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,69,188 క్యూసెక్కులు ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 7 లక్షల క్యూసెక్కుల లోపు వరద చేరే అవకాశం ఉంది.
==> గోదావరి నది భద్రాచలం వద్ద 50.30 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 11,03,802 క్యూసెక్కులు ఉండి మొదటి హెచ్చరిక కొనసాగుతుంది. దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరి ఆ తరువాత గురువారం నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
==> సహాయక చర్యల కోసం 3 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook