)
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీనడం శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.మరోవైపు గుజరాత్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం ఇవాళ అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. అది వాయుగుండంగా బలపడే అవకాశముంది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడతయాని భావిస్తున్నారు.
గురువారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా భారీగా వానలకు అవకాశం ఉందంటున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 4, కృష్ణా జిల్లా పెడనలో 3.95, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.47, నర్సీపట్నం, కాకినాడల్లో 3.4 సెంటీమీటర్ల వర్షం పడింది.
మరోవైపు ఐఎండీ అంచనా ప్రకారం ఈ ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉండే పోస్ట్ మాన్సూన్ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబరులో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ వర్షాలతో వరదల ప్రమాదం కూడా ఉంది కాబట్టి, ఐఎండీ ఇచ్చే ముందస్తు హెచ్చరికలను పాటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉండే పోస్ట్ మాన్సూన్ సీజన్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.