
Heavy rains in Two Telugu States: ఉపరితల ఆవర్తనానికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.ఈ రోజు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
అటు ఆంధ్ర ప్రదేశ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో..వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇటు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం,ఏలూరు లో వానలు కురుస్తాయని వెల్లడించింది. అటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, NTR కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.