Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..

Heavy Rains: రుతుపవనాలు దూకుడుగా కదులుతున్నాయి. మూడు రోజుల్లో కేరళలోకి ప్రవేశంచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో నిన్న, ఈ రోజు భారీ వర్షాలు పడనున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : May 22, 2025, 08:02 AM IST
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..

Heavy Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాగల నాలుగు  రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కర్నాటక-గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఉన్న ఉపరితల ఆవర్తం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీంతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని‌ మధ్య ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అటు ఈ ద్రోణి ప్రభావంతో  దక్షిణ తెలంగాణపై ఉండనుంది.  

Add Zee News as a Preferred Source

ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న  బుధవారం  మారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, నిజామాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కాజోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. అటు
సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి  మంచిర్యాల, నిర్మల్‌, జిల్లాల్లో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వానలు పడటంతో పంట పొలాలు నీటితో నిండిపోయాయి. దీంతో ఆరుగాలం పంట పండించిన రైతుల కంట్లో కడగండ్లే మిగిలాయి.  

ఈ రోజు గురువారం కరీంనగర్‌, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, పెద్దపల్లి, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  

కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట,  సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

అలాగే, శుక్ర, శని, ఆదివారాల్లోనూ హైదరాబాద్‌ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News