Hero suman on ap politics video viral: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి భారీ విజయం సాధించింది. అదే విధంగా వైసీపీ జగన్ ఎవరు కూడా ఊహించని విధంగా ఓటమి పాలయ్యింది. వైనాట్ 175 అన్న జగన్ కు ఏపీ ప్రజలు కేవలం.. 11 స్థానాలకు మాత్రమే పరమితం చేశారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో.. వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలతో పాటు, 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.
కానీ ఇటీవల జరిగిన ఎన్నికలలో మాత్రం సీన్ అంత రివర్స్ అయ్యింది. ఈ క్రమంలో హీరో సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్స్ సర్కిల్స్ లలో హట్ టాపిక్ గా మారాయి. ఏపీలో గతంతో ఎన్నికల సమయంలో బీజేపీ, జనసేన, బీజేపీలు కలిసి బరిలోకి దిగాయని హీరో సుమన్ అన్నారు. కానీ వైఎస్ జనగ్ మాత్రం సింహం సింగిల్ అన్న విధంగా ఒక్కడే బరిలోకి దిగారన్నారు.
అదే విధంగా ఏపీలో జరిగిన ఎన్నికలలో.. చాలా తక్కువ మార్జీన్ లలో.. ఓటమి పాలైందని అన్నారు. అయితే.. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నసమయంలో స్కూళ్లతో పాటు.. అనేక పథకాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. డిజిటల్ బోర్డులు, నాడు నేడు, టాయ్ లెట్ లను ఆధునీకరించడం, పేదలకు ఇంటికే నెలతిరక్కుండానే పింఛన్ లు వంటి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారన్నారు. కరోనా వంటి విపత్తు సమయంలో కూడా జగన్ మంచి పాలన అందించారన్నారు.
ఒకరకంగా చూస్తే.. ఆవైపు మోదీ, చంద్రబాబు, పవన్ లు కలిసి.. ఒక్కడైన జగన్ కు ఎదుర్కొనేందుకు వచ్చారన్నారు. అయిన కూడా జగన్ చాలా తక్కువ మార్జీన్ తో మాత్రమే ఓటమి పాలయ్యారని.. ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ప్రస్తుతం హీరో సుమన్ చేసిన వ్యాఖ్యల వీడియోలను వైసీపీ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









